గాలి కంపెనీకి ‘ఓబుళాపురం’ అనే పేరెలా వచ్చింది ?

అనంతపురం జిల్లాలో ఓబులమ్మ పేరుతో గ్రామదేవతుంది;

Update: 2025-05-07 13:10 GMT
OMC company of Gali Janardhana Reddy

ఓఎంసీగా పాపులరైన ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులో సీబీఐ కోర్టు ఐదుగురికి ఏడేళ్ళచొప్పున శిక్ష విధించిన విషయం అందరికీ తెలిసిందే. ఓఎంసీ కేసులో ఎవరి పాత్ర ఎంతన్న విషయంతో పాటు అసలు ఈ కేసు ఏమిటన్నది క్లుప్తంగా చూద్దాం. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ(OMC)కి యజమాని గనుల కింగ్ గా పాపులరైన గాలి జనార్ధనరెడ్డి(Gali JanardhanaReddy). గాలికి దేశంలోని చాలా రాష్ట్రాల్లో గనుల వ్యాపారాలున్నాయి. ఇపుడు ఓఎంసీకి ఆ పేరు ఎలాగ వచ్చింది ? ఎలాగంటే అనంతపురం జిల్లా డీ హీరేలాల్ మండలంలో ఓబులమ్మ పేరుతో గ్రామదేవతుంది. ఆదేవత పేరుతో ఏర్పడిన గ్రామమే ఓబుళాపురం(Obulapuram). ఓబుళాపురం గ్రామంలో మైనింగ్ కంపెనీ కార్యకలాపాలు మొదలుపెట్టారు కాబట్టే గాలి కంపెనీకి ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అనే పేరొచ్చింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్(YSR) కు అత్యంత సన్నిహితుడైన గాలికి ఓబుళాపురంలో 68.5 హెక్టార్లు, పక్కనే ఉన్న మరో గ్రామం మల్పనగుడిలో 39.5 హెక్టార్లలో ముడిఇనుము ఖనిజాన్ని తవ్వుకోవటానికి అప్పటి వైఎస్ ప్రభుత్వం అనుమతులు మంజూరుచేసింది.

గాలి ఏమిచేశారంటే తవ్వుకోవాల్సిన రెండు గ్రామాలతో పాటు పొరుగునే ఉన్న కర్నాటకలోని బళ్ళారి(Bellary) రిజర్వ్ ఫారెస్టులో కూడా ఇనుమ ఖనిజాన్ని తవ్వేసుకున్నాడు. ఈవిషయమై అప్పట్లోనే చాలా ఆరోపణలు వచ్చినా వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి గాలికి వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే వైఎస్ సడెన్ గా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించటంతో గాలిపైన అప్పటికే ఉన్న ఆరోపణలు మరింత పెరిగిపోయాయి. దాంతో సీఎం రోశయ్య ప్రభుత్వం గాలి కంపెనీమీద సీబీఐకి ఫిర్యదు చేసింది. సీబీఐకి ఎందుకు ఫిర్యాదుచేసిందంటే రెండురాష్ట్రాల్లో ఇనుపఖనిజాలను తవ్వుకున్నాడనే ఆరోపణలున్నాయి కాబట్టి స్టేట్ పోలీసుల దర్యాప్తు సాధ్యంకాదు. అందుకనే సీబీఐ విచారణ కోరుతు ఫిర్యాదుచేసింది ప్రభుత్వం.

Full View

ప్రభుత్వం నుండి ఫిర్యాదురాగానే వెంటనే సీబీఐ(CBI) రంగంలోకి దూకేసింది. గాలి అక్రమాలన్నింటినీ శాస్త్రీయంగా రుజువులు చేసే సాక్ష్యాలను సంపాదించి సీబీఐ కోర్టుముందుంచింది. దాదాపు 14 ఏళ్ళ విచారణలో 219 మంది సాక్ష్యులను, 3400 డాక్యుమెంటరీ ఎవిడెన్సును పరిశీలించిన కోర్టు గాలితో పాటు వ్యాపార భాగస్వామి బీవీ శ్రీనివాసరెడ్డి, అప్పటి గనుల శాఖ డైరెక్టర్ వీడీ రాజగోపాల్, ఓఎంసీ కంపెనీ, గాలికి పీఏగా పనిచేసిన మొహిసిన్ ఆలీఖాన్ కు ఏడెళ్ళ శిక్షలు విధించింది. ఆరోపణలకు ఎలాంటి సాక్ష్యాధారాలు లేని కారణంగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Sabita IndraReddy), అప్పటి గనుల శాఖ సెక్రటరీ యెర్రా శ్రీలక్ష్మి, మరో ఐఏఎస్ అధికారి కృపానందంకు క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే సుప్రింకోర్టు ఆదేశాలతో శ్రీలక్ష్మి మీద తెలంగాణ హైకోర్టు మళ్ళీ విచారణ జరపబోతోంది. మూడునెలల్లో విచారణ ముగించాలని హైకోర్టును సుప్రింకోర్టు ఆదేశించింది.

Tags:    

Similar News