ఆయుష్మాన్ భారత్ బీమా గోల్డెన్ కార్డ్ అంటే ఏమిటి? దాన్నెలా పొందాలి?
అత్యవసర వైద్యం ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి పేద కుటుంబానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది;
ఆరోగ్య బీమా, ప్రతి వ్యక్తి ధీమాగా ఆసుపత్రికి వెళ్లేందుకు సాధనం. ఆరోగ్య బీమా వుంటే, ఖర్చులేకుండా ధీమాగా చికిత్స పొందవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకోగలిగిన వారి సంగతి సరే హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకోలేని నిరుపేదల సంగతేంటి? ఇలాంటి వారుకూడా ప్రభుత్వ ఆసుపత్రులే కాదు, ప్రైవేటు ఆసుపత్రులలోనూ ధైర్యంగా చికిత్స పొందవచ్చు. ఏకంగా 5 లక్షల వరకు చికిత్స పైసా ఖర్చు లేకుండా పొందవచ్చు.
అందరికీ ఆరోగ్యం లక్ష్యంగా కేంద్రప్రభుత్వం పలు పథకాలను తీసుకొని వస్తోంది. అందులో భాగమే ఆయుష్మాన్ భారత్ గోల్డెన్ కార్డ్.ముఖ్యంగా సమాజంలోని బలహీన వర్గాలకు ఆరోగ్య సంరక్షణ అందించడంలో ఒక ముఖ్యమైన అడుగు, అర్హత కలిగిన లబ్ధిదారులు ఈ ముఖ్యమైన ఆరోగ్య బీమాను పొందడానికి అప్లై చేసుకోవచ్చు. అత్యవసర పరిస్థితులలో వైద్యంపై ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి పేద కుటుంబానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
ఆయుష్మాన్ భారత్ గోల్డెన్ కార్డ్ ఎంటే ఏమిటి?
ఆయుష్మాన్ భారత్ - ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (PMJAY) కింద జారీ చేయబడిన ఒక డిజిటల్ ఆరోగ్య కార్డే ఆయుష్మాన్ భారత్ గోల్డెన్ కార్డ్. ఈ కార్డు ద్వారా, అర్హత గల లబ్ధిదారులు ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల వరకు ఆరోగ్య బీమా పొందుతారు. ఈ కార్డు ద్వారా లబ్ధిదారులు ఎలాంటి డబ్బు చెల్లించకుండానే ఈ ప్యానెల్ లో వున్న ఆసుపత్రులలో చికిత్స పొందవచ్చు.
ఆయుష్మాన్ భారత్ గోల్డెన్ కార్డ్ ద్వారా లభించే ప్రయోజనాలు
*నగదు రహిత చికిత్స
ఈ కార్డు ఉన్నవారు ఈ పథకం కిందకు వచ్చే ఆసుపత్రులలో నగదు రహితంగా చికిత్స పొందవచ్చు, అంటే చికిత్స కోసం ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు.
*ప్రతి కుటుంబానికి 5 లక్షల వరకు కవరేజ్:
ఈ పథకం లో చేరిన ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల వరకు ఆరోగ్య బీమా కవరేజ్ లభిస్తుంది.
*ప్రైవేట్ ఆసుపత్రులలోనూ చికిత్స:
ఆయుష్మాన్ భారత్ గోల్డెన్ కార్డ్ ద్వారా లబ్ధిదారులు ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స పొందవచ్చు. ఏ చికిత్సకైనా ఈ కార్డు చూపించి ఆసుపత్రిలో అడ్మిట్ కావొచ్చు.
*ఆయుష్మాన్ భారత్ గోల్డెన్ కార్డ్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
ఆయుష్మాన్ భారత్ గోల్డెన్ కార్డ్ కోసం దరఖాస్తు చేయడానికి, మీరు ఆయుష్మాన్ భారత్ అధికారిక వెబ్‌సైట్ ( www.pmjay.gov.in) నుండి లేదా ఆయుష్మాన్ భారత్ యాప్ ద్వారా దరఖాస్తు చేయవచ్చు.
ముందుగా అర్హతను తనిఖీ చేసుకోవాలి. అందుకోసం PMJAY వెబ్‌సైట్ ఓపెన్ చేసి,
మీ మొబైల్ నంబర్ లేదా రేషన్ కార్డ్ నంబర్‌ను నమోదు చేయాలి.
మీరు అర్హులో కాదో మీ అర్హత(eligibility) తనిఖీ చేయండి.మీకు తగిన అర్హత వుంటే ఆయుష్మాన్ భారత్ గోల్డెన్ కార్డ్‌ని పొందవచ్చు. ఆయుష్మాన్ భారత్ గోల్డెన్ కార్డ్ అనేది పేద , ఆర్థికంగా బలహీనమైన కుటుంబాలకు ఒక గొప్ప వరం .
*ఆయుష్మాన్ భారత్ గోల్డెన్ కార్డ్ దరఖాస్తు ప్రక్రియ
ఆయుష్మాన్ భారత్ గోల్డెన్ కార్డ్ కోసం దరఖాస్తును ఆన్‌లైన్‌లో పూర్తి చేయవచ్చు, వీలుకాని లబ్థిదారులు ఈసేవా కేంద్రాలలో ధరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (PM-JAY) అధికారిక సైట్‌కు(www.pmjay.gov.in) లాగిన్ అవ్వండి
వెబ్‌సైట్‌లో, డ్రాప్‌డౌన్ మెను నుండి రాష్ట్రాన్ని (state)ఎంచుకోండి
పేజీలో రాష్ట్రాన్ని ఎంచుకున్న తర్వాత, అక్కడి దరఖాస్తు ఫారమ్ సూచనల (suggestion)ల ఆధారంగా ఫిల్ (fil) చేయాలి
అవసరం అయిన అన్ని సమాచారాలను ఖచ్చితంగా పూర్తి చేయాలి
అవసరమైన పత్రాలను (documents)అప్‌లోడ్ చేయాలి
*కావాల్సిన డాక్యుమెంట్లు (documents)
గుర్తింపు కార్డు : ఆధార్ కార్డ్/పాన్ కార్డ్
చిరునామా (address proof)
ఆదాయ ధృవీకరణ పత్రం ( income proof)
కులధృవీకరణ (cast certificate)
కుటుంబ పెద్ద పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్ (passport size photo)
అప్లికేషన్ లో అన్ని వివరాలు పూర్తి చేసి, అడిగిన అన్ని డాక్యుమెంట్లు అప్ లోడ్ (upload) చేసిన
అన్ని సమాచారాన్ని పూరించి, అవసరమైన అన్ని పత్రాలను అప్‌లోడ్ చేసిన తర్వాత, దరఖాస్తు సడ్మిట్ (submit)చేయాలి
వెంటనే ఒక రసీదు (acknowledgement) వస్తుంది. డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
*దరఖాస్తు చేసుకున్న తరువాత
దరఖాస్తును రాష్ట్ర అధికారులు ధృవీకరిస్తారు. దీనిని ప్రాసెస్ చేయడానికి కొంత సమయం పట్టవచ్చు. అయితే, ప్రాసెస్ పూర్తయిన తర్వాత, ఆయుష్మాన్ భారత్ గోల్డెన్ కార్డ్ కొన్ని వారాల్లో సిద్ధంగా ఉంటుంది. దానిని (PM-JAY) అధికారిక సైట్‌కు(www.pmjay.gov.in)నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలి.అనంతర
కార్డును ఉపయోగించి ఏదైనా వైద్య చికిత్స పొందే ముందు దానిని యాక్టివేట్ చేసుకోవాలి.
*రెన్యూవల్ చేసుకోవడం
ఆయుష్మాన్ భారత్ గోల్డెన్ కార్డ్ చెల్లుబాటు వ్యవధి ఒక సంవత్సరం. ప్రయోజనాలను పొందడం కొనసాగించడానికి, కార్డు గడువు ముగిసేలోపు దానిని రెన్యూవల్ (renewal) చేయాలి. మొదట్లో ధరఖాస్తు చేసుకున్న రీతిలోనే మరోమారు ఆదాయ ధృవీకరణ ఇతర వివరాలు అందించి ,తగిన డాక్యుమెంట్లు అప్ లోడ్ చేస్తే రెన్యువల్ అవుతుంది
ఆయుష్మాన్ కార్డు కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు, దరఖాస్తుదారులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియలో ఇబ్బంది పడినా దరఖాస్తు రిజక్ట్ అయినా కారణాలు తెలుసుకొని సంబంధిత అధికారిన సంప్రదించవచ్చు. తప్పులు సరిదిద్దుకొని తిరిగి దరఖాస్తు చేసుకునే అవకాశం వుంది.
*ఆయుష్మాన్ భారత్ కార్డు కోసం ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
ఆయుష్మాన్ భారత్ కార్డుకు అర్హతలు గ్రామీణ (rural), పట్టణ(urban)ప్రాంతాలలో నివసించే వ్యక్తుల ఆదాయం ఆధారంగా మారుతూ ఉంటాయి. అయితే, కేంద్ర మంత్రివర్గం సెప్టెంబర్ 2024లో ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB-PMJAY) కింద 70 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ
వయస్సు ఉన్న అన్ని సీనియర్ సిటిజన్లకు ఆరోగ్య బీమా కవరేజీని విస్తరించింది.
*పట్టణాలలో లబ్థిదారులు
రాగ్ పికర్స్
బిచ్చగాళ్ళు
గృహ కార్మికులు
వీధుల్లో పనిచేసే వీధి విక్రేతలు
హాకర్లు, చెప్పులు కుట్టేవారు
నిర్మాణ కార్మికులు, మేస్త్రీలు,
ప్లంబర్లు, కార్మికులు, వెల్డర్లు, పెయింటర్లు, కూలీలు, సెక్యూరిటీ గార్డులు ఇతర హెడ్-లోడ్ కార్మికులు
స్వీపర్లు, పారిశుధ్య కార్మికులు మాలిలు
గృహ ఆధారిత కార్మికులు,
చేతివృత్తులవారు, దర్జీలు
రవాణా కార్మికులు, కండక్టర్లు, డ్రైవర్లు, బండి లాగేవారు, డ్రైవర్లకు సహాయకులు , రిక్షా వాళ్లు
దుకాణ కార్మికులు, చిన్న సంస్థలలోని ప్యూన్లు, డెలివరీ అసిస్టెంట్లు, సహాయకులు, వెయిటర్లు ,అటెండర్లు
ఎలక్ట్రీషియన్లు, అసెంబ్లర్లు, మెకానిక్స్ , వాషర్ మెన్
గ్రామీణ ప్రాంతాలలో లబ్థిదారులు
ఒక గది ఉన్న కుచా ఇళ్లలో నివసిస్తున్న కుటుంబాలు
16-59 సంవత్సరాల వయస్సు గల వయోజన సభ్యులు లేని కుటుంబాలు
SC/ST గృహాలు
వికలాంగుడు కాని వయోజన సభ్యుడు కాకుండా వికలాంగ సభ్యుడు ఉన్న కుటుంబాలు
16-59 సంవత్సరాల వయస్సు గల వయోజన పురుష సభ్యులు లేని కుటుంబాలు
మాన్యువల్ క్యాజువల్ లేబర్ పై ఆధారపడిన భూమిలేని కుటుంబాలు
సీనియర్ సిటిజన్లు
గ్రామీణ ,పట్టణ ప్రాంతాలలో 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు, ఆయుష్మాన్ భారత్ PMJAY కింద ఇప్పటికే కవర్ చేయబడిన సీనియర్ సిటిజన్లు సంవత్సరానికి రూ. 5 లక్షల వరకు అదనపు టాప్-అప్ కవర్ పొందేందుకు అర్హులు.
మాజీ సైనికుల సహకార ఆరోగ్య పథకం (ECHS), కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (CGHS), లేదా ఆయుష్మాన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (CAPF) వంటి ఇతర ప్రజారోగ్య బీమా పథకాల నుండి ఇప్పటికే ప్రయోజనాలను పొందుతున్న సీనియర్ సిటిజన్లు వారి ప్రస్తుత పథకాన్ని కొనసాగించవచ్చు లేదా AB PMJAYకి మారవచ్చు.
ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు లేదా ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ (ESI) పథకం కింద కవర్ చేయబడిన సీనియర్ సిటిజన్లు AB PMJAY కి అర్హులు.
ఆయుష్మాన్ భారత్ పీఎం-జేఏవై ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ పథకం. ఈ పథకం వల్ల దాదాపు 10 కోట్ల పేద కుటుంబాలు లబ్ది పొందుతాయి. లబ్దిదారులు సుమారు 50 కోట్ల మంది ఉంటారని అంచనా. భారత జనాభాలో 40 శాతం మంది ఈ స్కీమ్ కిందకు వస్తున్నారు.ఆసుపత్రిలో చేరినప్పుడు అయిన ఖర్చులతో పాటు పరీక్షలు, చికిత్స, కన్సల్టేషన్, ప్రీ హాస్పిటలైజేషన్, నాన్ ఇంటెన్సివ్, ఇంటెన్సివ్ కేర్ సేవలు, మందులు, డయాగ్నోస్టిక్స్, లేబోరేటరీ వంటి పలు ఖర్చులను ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తున్నది .