నలుగురు పిల్లల్ను కాదనుకుని ప్రియుడితో వెళిపోయిన భార్య

తన పిల్లలకు తల్లి, తనకు భార్య కావాలని భార్య వెంటపడుతున్నాడు భర్త.;

Update: 2025-07-22 12:07 GMT

ఇదొక విచిత్రమైన కేసు. భర్త, పిల్లలు వద్దు..ప్రియుడే ముద్దని భార్య వెళిపోయింది. అయితే తన పిల్లలకు తల్లి, తనకు భార్య కావాలని భార్య వెంటపడుతున్నాడు భర్త. తనభార్యను ఎలాగైనా తెచ్చి తనకు అప్పగించాలని భర్త పంచాయితి పెద్దలు, పోలీసులను బతిమలాడుకుంటున్న విచిత్రమైన ఘటన వరంగల్ జిల్లాలోని పిట్టలగూడెంలో జరిగింది. ఇంతకీ ఏమి జరిగిందంటే వరంగల్ జిల్లాలోని షోడషపల్లి శివారు పంచాయితి పిట్టలగూడెంలో భర్త కాలియా శంకర్, భార్య చంద్రమ్మ, నలుగురు పిల్లలు ఉంటున్నారు. అయితే సడెన్ గా ఒకరోజు భార్య తన ప్రియుడు రాజుతో ఇంట్లోనుండి లేచిపోయింది. అప్పటినుండి భర్త శంకర్ పంచాయితీ పెద్దలదగ్గర నానా గోలచేస్తున్నాడు.

పంచాయితీ పెద్దలకు ఏమి సంబంధం అంటే ప్రియుడికి భార్యను అప్పగించిందే పంచాయితి పెద్దలు కాబట్టి. శంకర్-చంద్రమ్మతో ఎనిమిదేళ్ళ క్రితం వివాహమైంది. వీళ్ళకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుర్లున్నారు. సజావుగానే సాగుతున్న వీళ్ళ కాపురంలోకి ఏడాది క్రిందట రాజు అనే యువకుడు ప్రవేశించాడు. వివాహం అయిన తర్వాత చంద్రమ్మ, రాజులు బాగాసన్నిహితమయ్యారు. లోక్యాతండా గ్రామపంచాయితీ, వేపలగడ్డతండాకు చెందిన అజ్మీరా రాజుతో చంద్రమ్మకు వివాహేతర సంబంధం ఏర్పడింది. మూడునెలల క్రితం భర్త, పిల్లలను వదిలేసి రాజుతో చంద్రమ్మ పారిపోయింది.

చంద్రమ్మ కనబడటంలేదని చెప్పి భర్త శంకర్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదుచేశాడు. పోలీసులు చుట్టుపక్కలంతా గాలించి ఇద్దరినీ పట్టుకుని ఇంటికి తీసుకొచ్చారు. ఇదే విషయమై రాజు, చంద్రమ్మ కుటుంబాల మధ్య పెద్ద గొడవజరిగింది. రెండు కుటుంబాలు ఫంచాయితీపెద్దల దగ్గర ఫిర్యాదులు చేసుకున్నారు. దాంతో కులపెద్దలు జోక్యంచేసుకుని రెండు కుటుంబాల్లో ప్రశాంతత ఏర్పడాలని అనుకుని చంద్రమ్మను ఆమె తల్లి ఊరికి పొమ్మన్నారు కొన్నిరోజులు. తల్లి దగ్గరకు వెళ్ళిన చంద్రమ్మ ఎన్నిరోజులైనా రాకపోవటంతో శంకర్ కు అనుమానం వచ్చింది. దాంతో అత్తగారి ఇంటికి వెళ్ళిన చంద్రమ్మ కనబడలేదు. అడిగితే పొంతనలేని సమాధానాలు చెప్పారు. విషయం ఏమిటని వాకాడు చేస్తే అసలు విషయం బయటపడింది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే చంద్రమ్మ తల్లి ఊరిలో ఉందని తెలుసుకున్న ప్రియుడు రాజు వెంటనే ఆమెదగ్గర వాలిపోయాడు. ఇంకేముంది వెంటనే ఇద్దరు మళ్ళీ అక్కడినుండి జంప్. వీళ్ళకోసం భర్త ఎంత వెదికినా కనబడకపోవటంతో చేసేదిలేక తిరిగి ఊరికి వెళ్ళిపోయాడు.

ఈమధ్యనే రాజు, చంద్రమ్మ తల్లి ఊరికి వచ్చారని తెలుసుకున్న భర్త శంకర్ వెంటనే ఆ ఊరికి వెళ్ళాడు. ఊరిలో ప్రియుడు రాజు, భార్య చంద్రమ్మను చూడగానే మండిపోయిన శంకర్ ఇద్దరిని పట్టుకుని చితకబాదాడు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వాళ్ళు విషయాన్ని పోలీసులకు చెప్పారు. శంకర్ కొట్టిన దెబ్బలు బాగా తగలటంతో పోలీసులు ఇద్దరినీ వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలోనే పంచాయితీ పెద్దలు, పోలీసులు, చంద్రమ్మ, రాజు, శంకర్ కుటుంబాల మధ్య పంచాయితీ జరిగింది. తనకు భర్త, పిల్లలు వద్దని చెప్పిన చంద్రమ్మ ప్రియుడు రాజుతోనే ఉంటానని పట్టుబట్టి కూర్చుంది. దాంతో చేసేదిలేక పంచాయితీ పెద్దలు చంద్రమ్మను రాజుతో ఉండేట్లుగా నిర్ణయించి ఆసుపత్రి నుండి పంపేశారు. అక్కడ చేసేదిలేక పోలీసులు వెళ్ళిపోయారు. అయితే శంకర్ మాత్రం అందుకు అంగీకరించలేదు. తనకు తన భార్య కావాలని, తల్లి లేకపోవటంతో పిల్లలు ఏడుస్తున్నారంటు పంచాయితీ పెద్దల దగ్గర మళ్ళీ పంచాయితీ పెట్టాడు. పంచాయితి పెద్దలు ఏమీ మాట్లాడకపోవటంతో భర్త వెంటనే పోలీసులను ఆశ్రయించి న్యాయంచేయమని నానా గోలచేస్తున్నాడు. పోలీసులు ఏమిచేస్తారో చూడాలి.

Tags:    

Similar News