ప్రయాణికులకు మెట్రో షాక్..SSO కార్డు రద్దయినట్లే..!
సూపర్ సేవర్.. మెట్రో హలిడే కార్డుకు మంగళం పాడారు. ఈ ఆఫర్ మరో ఏడాది ఉంటుందని చెప్పిన 48 గంటల్లోనే మెట్రో తూచ్ అనేసింది. రూ.59లకే ప్రయాణ సౌకర్యాన్ని రద్దు చేసింది;
మెట్రో ప్రయాణీకులకు షాక్ తగిలింది. ఎటువంటి ముందస్తు ప్రకటనలు లేకుండా మెట్రో యాజమాన్యం సూపర్ సేవర్ కార్డును రద్దు చేసింది. పండగలు, వీకెండ్ వేళల్లో టికెట్ ధరపై తగ్గింపు కల్పిస్తూ తీసుకొచ్చిన సూపర్ సేవర్ హాలిడే కార్డు(SSO) రద్దు అయిందని చెప్పారు మెట్రో సిబ్బంది. రంజాన్ పండగ సందర్భంగా మెట్రోలో ఈ కార్డ్ వినియోగించడానికి ప్రయత్నించిన ప్రయాణికులు చేదు అనుభవం ఎదురైంది. SSO కార్డ్ సమయం నిన్నటితో అంటే ఆదివారంతో ముగిసిందని స్పస్టం చేశారు. అయితే ఇన్నాళ్లూ వాళ్లు వినియోగిస్తున్న సూపర్ సేవర్ హాలిడే ఆఫర్ నేటితో ముగియనుంది. కానీ ఈ ఆఫర్‌ను మరో ఏడాది అంటే 31 మార్చి 2026 వరకు పొడిస్తున్నట్లు మెట్రో యాజమాన్యం రెండు రోజుల క్రితం ప్రకటించిందని వార్తలు వచ్చాయి. వాటిని చూసిన ప్రయాణికులు ఎప్పటిలానే మెట్రో స్టేషన్‌కు తమ ఆఫర్ కార్డులు పట్టుకుని వెళ్లారు. కానీ అక్కడకు వెళ్లాక మాత్రం సిబ్బంది.. ఈ కార్డ్ పనిచేయదని షాక్ ఇచ్చారు. అదేంటి అని ప్రశ్నిస్తే.. ఈ కార్డులు మార్చి 30తో లాస్ట్ సర్.. రద్దయ్యాయి అని బదులిస్తున్నారు. అలా కాదండి.. పొడిగించినట్లు వార్తలు వచ్చాయి కదా అని ప్రయాణికులు అయోమయంగా అడిగితే.. లేదు.. సర్ ఒకవేళ పొడిగించే ఆలోచన యాజమాన్యానికి ఉంటే ఎప్పుడైనా మళ్ళీ ప్రకటన విడుదల చేయొచ్చు.. ఇప్పటికి అయితే రద్దు అయ్యాయి అని సిబ్బంది చెప్పారు.
కానీ పెద్దపెద్ద సంస్థలు సైతం ఈ ఆఫర్‌ను మెట్రో పొడిగించిందని వార్తలు ఇచ్చినా సిబ్బంది మాత్రం రద్దు అయిందని అనడగంతో చాలా మంది ప్రయాణికులు సందిగ్దంలో ఉన్నారు. దీనిపై తమకు స్పష్టత ఇవ్వాలని, అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేయాలని, దానిని ప్రతి మోట్రో ట్రైన్‌లో అందుబాటులో ఉంచాలని ప్రయాణికులు మెట్రో యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నారు. సూపర్ సేవర్ హాలిడే కార్డ్ పొడిగింపుకు సంబంధించి కేవలం వార్తలే రావడంతో ఆ కార్డ్ నేటితో రద్దు అయింది అనేది అధికారికంగా మారింది. అయితే ఈ కార్డ్ ద్వారా 20 ట్రిప్‌లకు డబ్బులు చెల్లించి 30 ట్రిప్పులు ప్రయాణం చేయొచ్చు.