హైదరాబాద్ తయారీ ఆయుధాలకు పెరిగిపోయిన డిమాండ్
స్వల్వకాలిక యుద్ధంలో హైదరాబాద్ లో తయారైన ఆయుధాల హవా మొదటిసారిగా బాగా హాలైట్ అయ్యాయి;
ఆపరేషన్ సిందూర్ దెబ్బకు దాయాది దేశం పాకిస్తాన్ వణికిపోయింది. నాలుగురోజుల యుద్ధ కాని యుద్ధంలో మన రక్షణ దళాల దెబ్బకు పాకిస్తాన్ కు ముచ్చెమటలుపట్టింది. నాలుగురోజుల స్వల్వకాలిక యుద్ధంలో బాగా హైలైట్ అయ్యింది ఏమిటంటే హైదరాబాద్ లోని డీఆర్డీవో, బీడీఎల్, బీహెచ్ఈఎల్ తో పాటు ప్రైవేటుసంస్ధల్లో తయారైన క్షిపణి వ్యవస్ధలు, బుల్లెట్లు, మిస్సైల్ వ్యవస్ధలే. ఆపరేషన్ సిందూర్ దెబ్బకు హైదరాబాద్(Hyderabad) కంపెనీల్లో తయారయ్యే ఆయుధాలకు, సాంకేతిక పరికరాలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. స్వల్వకాలిక యుద్ధంలో హైదరాబాద్ లో తయారైన ఆయుధాల హవా మొదటిసారిగా బాగా హాలైట్ అయ్యాయి. అందుకనే హైదరాబాదులోని ఆయుధ తయారీ కంపెనీలకు ఆర్డర్లు కుప్పలుతెప్పలుగా వచ్చిపడుతున్నాయి.
ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) తో హైదరాబాదులో ఉన్న రక్షణరంగ సంస్ధలతో పాటు కొన్ని ప్రైవేటుకంపెనీలకు ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వరంగంలో డీఆర్డీవో, బెల్, బీడీఎల్ కంపెనీలు చాలాకాలంగా రక్షణరంగానికి సంబంధించిన ఉత్పత్తులు చేస్తున్నాయి. అలాగే వీటితో పాటు ప్రైవేటు కంపెనీలైన ఎంటార్ టెక్నాలజీస్, అదాని ఎల్బిట్ అడ్వాన్డ్స్ సిస్టమ్స్, ఆస్త్రా మైక్రోవేవ్, కల్యాణి రాఫెల్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్, అనంత్ టెక్నాలజీస్, రఘువంశీ, జెన్ టెక్నాలజీస్ సంస్ధలకు సైనికదళాల నుండి పెద్దఎత్తున ఆర్డర్లు వస్తున్నాయి. ఆపరేషన్ సిందూర్ లో పైన చెప్పిన కంపెనీలు తయారుచేసిన ఆయుధాలు, ఆయుధ విడిభాగాలు, సాంకేతిక పరికరాలు తమ సత్తాను చాటాయి.
తాత్కాలికంగా ఆపరేషన్ సిందూర్ కు విరామం దొరికినా ఏ నిముషంలో అయినా మళ్ళీ పాకిస్తాన్(India-Pakistan War) మీద విరుచుకుపడే అవకాశాలున్నాయి. ఒకవేళ పాకిస్తాన్ తో పూర్తిస్ధాయి యుద్ధమే మొదలైతే అప్పుడు ఎన్ని ఆయుధాలున్నా సరిపోవు. అందుకనే ముందుజాగ్రత్తగా రక్షణశాఖ భారీఎత్తున ఆయుధాలను కొనుగోలు చేయాలని డిసైడ్ చేసింది. బ్రహ్మో(Brahmas Missileస్), ఆకాశ్ క్షిపణులు(Akash Missile), ద్రోన్లను పెద్దఎత్తున కొనుగోలు చేయాలని త్రివిధ దళాల అధిపతులు నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఆపరేషన్ సిందూర్ లో అందరి దృష్టిని ఆకర్షించిన హైదరాబాద్ కంపెనీల ఉత్పత్తులకే అత్యధిక ఆర్డర్లు వచ్చాయి. ఒకపుడు సైనికదళాలు ఇచ్చిన ఆర్డర్లను సరఫరాచేసేందుకు కంపెనీలకు ఏడాదిన్నర గడువుండేది. కాని ప్రస్తుత నేపధ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అర్జంటుగా ఆయుధాలు, విడిభాగాలను తయారుచేసి ఇవ్వాలని త్రివిధ దళాధిపతులు స్పష్టంగా చెప్పారని సమాచారం.
రష్యాకంపెనీ సహాకారంతో డీఆర్డీవో బ్రహ్మోస్ క్షిపణిని తయారుచేసింది. బ్రహ్మోస్ పాకిస్తాన్లోని నౌకాశ్రయాలు, విమానాశ్రయాలను ధ్వంసంచేయటంలో కీలకపాత్రను పోషించింది. అందుకనే బ్రహ్మోస్ మిస్సైల్స్ ను పెద్దఎత్తున కొనుగోలు చేసేందుకు ఎయిర్ ఫోర్స్ ఆర్డర్లు ఇచ్చింది. బ్రహ్మోసే కాకుండా డీఆర్డీవో రాడార్ వార్నింగ్ రిసీవర్స్, రాడార్ కంప్యూటర్స్ కూడా తయారుచేస్తుంది. ఈ రాడార్ వ్యవస్ధలు నూరుశాతం కచ్చితత్వంతో పనిచేసిన విషయం అందరికీ తెలిసిందే. శతృదేశాలు ప్రయోగించే క్షిపణలు, ద్రోన్లను పసిగట్టె సాంకేతిక రాడార్లను డీఆర్డీవో తయారుచేసింది. ఇలాంటి రాడార్లతోనే పాకిస్తాన్ ప్రయోగించిన ద్రోన్లు, మిస్సైల్స్ ను మన ఎయిర్ ఫోర్స్ దళాలు ఆకాశంలోనే కూల్చగలిగాయి.
ఇక బెల్(భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్) లో తయారయ్యే ఉత్పత్తులు లాంగ్ రేంజ్ గైడెడ్ బాంబులు, ఎంకే 82, ఎంకే83, ఎంకే 84 బాంబుల్లో వాడే సాంకేతికత, ఎలక్ట్రానిక్ ఫ్యూజులు, చిన్న, మధ్య, భారీ క్యాలిబర్ ఆయుధాలు, వివిధ సైజుల్లో మెషీన్ గన్లను బీఈఎల్ ఉత్పత్తిచేస్తోంది. అలాగే రాడార్లు, కమ్యూనికేషన్ వ్యవస్ధను, సీ41 సిస్టమ్స్ అండ్ ఎలక్ట్రో ఆప్టిక్ తదితర సాంకేతిక పరికరాలను తయారుచేస్తోంది. ఇక ప్రైవేటుకంపెనీలతో పాటు ప్రభుత్వ రంగం సంస్ధల్లో ఆకాష్ క్షిపణితో పాటు అనేక మిస్సైల్స్ లో ఉపయోగించే సాంకేతిక పరికరాలను హైదరాబాద్ కంపెనీలు తయారుచేస్తున్నాయి. మొన్నటి యుద్ధంకాని యుద్ధంలో హైదరాబాద్ కంపెనీలు తయారుచేసిన ఆయుధాలు, సాంకేతిక పరికరాల పనితీరు బ్రహ్మాండంగా ఉన్నాయని త్రివిధ దళాధిపతులు నూరుశాతం సంతృప్తి వ్యక్తంచేశారు. రక్షణరంగ నిపుణులు కూడా హైదరాబాద్ తయారీ ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని తెగ మెచ్చుకున్నారు. దాంతో అత్యవసరం కింద పైన చెప్పిన కంపెనీలకు ఆయుధాలు, సాంకేతిక పరికరాల ఉత్పత్తికి భారీ ఆర్డర్లు వచ్చాయి.