తీన్మార్ మల్లన్న కార్యాలయంపై జాగృతి కార్యకర్తల దాడి
ఐదురౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపిన గన్ మెన్;
కాంగ్రెస్ ఎంఎల్సీ చింతపండు నవీన్ కుమార్ (తీన్మార్ మల్లన్న )కార్యాలయంపై దాడి జరిగింది. బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసినుందుకు జాగృతి కార్యకర్తలు తీన్మార్ మల్లన్న కార్యాలయానికి వెళ్లి దాడి చేశారు. అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. జాగృతి కార్యకర్తలను నిలువరించేందుకు తీన్మార్ మల్లన్న గన్ మెన్ ఐదురౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. దాడి చేస్తుండగా అద్దాలు పగిలి జాగృతి కార్యకర్తలకు ఒరుసుకుపోయింది. గాజు అద్దాలు ఒరుసుకుపోవడం వల్ల తీవ్ర రక్త స్రావం అయ్యింది. ఈ రక్తం ఫ్లోరంతా పరచుకుంది. గాజు అద్దాల వల్ల గాయపడిన కార్యకర్తలను ఆస్పత్రికి తరలించారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావాలని నిర్ణయించింది. ఆర్డినెన్స్ వచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నిర్ణయం పట్ల జాగృతి అధ్యక్షురాలు కవిత హర్షం వెలిబుచ్చారు. జాగృతి కార్యాలయంలో ఆమె సంబురాలు జరుపుకున్నారు.
‘‘కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కవితకు ఏం సంబంధం అని మల్లన్న వ్యాఖ్యలు చేశారు. ఆమె ఏమన్న బీసీనా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనా మరి సంబురాలు ఎందుకు చేసుకుంటున్నారు’’ అని తీన్మార్ మల్లన్న ప్రశ్నించారు. మల్లన్న చేసిన ఈ వ్యాఖ్యలు జాగృతి కార్యకర్తలకు అగ్రహం తెప్పించింది. ఆదివారం ఉదయం తీన్మార్ మల్లన్నకార్యాలయానికి వెళ్లి దాడులు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు తీన్మార్ కార్యాలయానికి వెళ్లి ఇరు వర్గాలకు చెందిన కార్యకర్తలను సముదాయించి పంపించివేశారు