‘నా భర్త అమాయకుడు’.. టీఎఫ్‌సీసీని ఆశ్రయించిన జానీ మాస్టర్ భార్య సుమలత
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులోకి ఆయన భార్య సుమలత ఎంట్రీ ఇచ్చారు. బాధితురాలికి వ్యతిరేకంగా ఆమె ఫర్యాదు చేశారు.
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులోకి ఆయన భార్య సుమలత ఎంట్రీ ఇచ్చారు. బాధితురాలికి వ్యతిరేకంగా ఆమె ఫర్యాదు చేశారు. తన భర్త జానీని బాధితురాలు ట్రాప్ చేసిందని, మూవీ ఇండస్ట్రీలో జానీకి వస్తున్న గుర్తింపు చూసి ఆయన్ను సొంతం చేసుకోవాలని సదరు బాధితురాలు ఈ పన్నాగం పన్నిందంటూ ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె తెలుగు ఫిర్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు తన ఫిర్యాదును అందించారు. పాన్ ఇండియా స్థాయిలో జానీకి అవకాశాలు వస్తున్నయాని, అందువల్లే ఆయన్ను సొంతం చేసుకోవడం కోసం బాధితురాలు తన తల్లితో కలిసి ఈ కుట్రలను రచించిందంటూ సుమలత తన ఫిర్యాదులో పేర్కొంది. ఆఖరికి బాధితురాలు తనను కూడా వేధించిందని, ఆమె వేధింపులు తట్టుకోలేక ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన కూడా చేశానని సుమలత తెలిపారు. తన భర్త తప్పేమీ లేదని, పెళ్లి చేసుకోవాలని బాధితురాలే తన భర్తపై ఒత్తిడి తీసుకొచ్చిందని సుమల తన ఫిర్యాదులో ఆరోపించారు. ఆమె ఫిర్యాదు ప్రస్తుతం సంచలనంగా మారింది.
నా భర్తే బాధితుడు
‘‘నా భర్తపై కుట్రపూరితంగానే తప్పుడు కేసు బనాయించారు. ఈ కేసు నిరాధారమైనది. ఇందులో అసలు బాధితుడు నా భర్తే. బాధితురాలే ఆయన్ను ట్రాప్ చేసింది. తనను పెళ్ళి చేసుకోవాలంటూ ఒత్తిడి తెచ్చింది. నన్ను సైతం వేధింపులకు గురిచేసింది. ఆ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందామనుకున్నారు. ఇండస్ట్రీలో జానీ ఎదుగుతున్న తీరు, పాన్ ఇండియా స్థాయిలో ఆయనకు అందుతున్న అవకాశాలు, వీటితో ఆయనకు వస్తున్న పేరు ప్రఖ్యాతలు చూసి బాధితురాలు ఆయనను ట్రాప్ చేసింది. పెళ్ళి చేసుకోవాలంటూ ఒత్తిడి తెచ్చింది. అందుకు నిరాకరించడంతో ఇప్పుడు నా భర్తపై అత్యాచారం కేసు మోపింది. ఇందులో సదరు మహిళ తల్లికి కూడా పాలుపంచుకుంది. తన కూతురిని పెళ్ళి చేసుకోవాలని బెదిరింపులకు పాల్పడింది. అన్యాయంగా నా భర్తను కటకటాల పాలు చేశారు. నాకు, నా పిల్లలకు ఏమైనా జరిగితే అందుకు ఆ బాధితుతారలు, ఆమె తల్లే కారణం. నా కుటుంబానికి న్యాయం చేయండి’’ అని సుమలత టీఎఫ్‌సీసీకి అందించిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
పక్కా ప్లాన్‌తోనే కేసు
‘‘నా భర్తను ఇరికించాలని, డ్యాన్స్‌మాస్టర్‌గా ఆయన కెరీర్‌ను ఛిన్నాభిన్నం చేయాలన్న పక్కా ప్లాన్‌తోనే ఈ కేసుకు తెరలేపారు. నేషనల్ అవార్డు రావడం, జనసేనలో క్రియాశీలకంగా ఉండటంతోనే ఆయన టార్గెట్‌గా మారాడు. ఎప్పుడో లైంగిక దాడి జరిగితే ఇంతకాలం ఎందుకు బయటకు రాలేదు. పా భర్తపై పోక్సో చట్టం కింద కూడా కేసు పెట్టారు. బాధితురాలు నిజంగా మైనర్‌గా ఉన్నప్పుడే ఆమెపై అత్యాచారం జరిగిందని నిరూపిస్తే నేనే నా భర్తను వదిలి వెళ్లిపోతాను. కొన్నిసార్లు మనం చూసేది కూడా నిజం కాదు’’ అని అన్నారామే.
ఎన్నో అవకాశాలిప్పించారు..
‘‘జానీ మాస్టర్ దగ్గర పనిచేయడం తన అదృష్టపని సదరు బాధితురాలు చెప్పింది. అత్యాచారం చేసిన వ్యక్తి గురించి ఎవరనా అలా మాట్లాడతారా? ఇందుకు గతంలో ఆమె ఇచ్చిన ఎన్నో ఇంటర్వ్యూలే నిదర్శనం. ఆ అమ్మాయికి హైదరాబాద్‌లో మాస్టర్ కార్డ్ రాకపోతే మంబైలో ఇప్పించారు. తాను చేస్తున్న ఎన్నో సినిమాల్లో ఆ అమ్మాయికి కొరియోగ్రాఫర్‌గా అవకాశం కూడా ఇప్పించాడు నా భర్త. ఇటీవల శర్వానంద్ హీరోగా చేస్తున్న సినిమాలో కూడా ఆమెకు అవకాశం కల్పించారు. నిజంగా ఆమెను తొక్కేయాలని, అవకాశాలు లేకుండా చేయాలని అనుకుంటే ఆమెకు ఇన్ని అవకాశాలు ఎందుకు ఇప్పిస్తారు?’’ అని సుమలత ప్రశ్నించారు. అంతేకాకుండా సదరు బాధితురాలికి ఎంతో మందితో ఎఫైర్లు ఉన్నారని కూడా ఆరోపించారు.
ఎన్నో ఎఫైర్లు..
‘‘స్ట్రీలో టాప్‌కు చేరాలనేది బాధితురాలు, ఆమె తల్లి కల. జానీ దగ్గర చేరకముందు ఆమె చాలా డ్యాన్స్ షోస్‌లో పాల్గొంది. ఎంతో మందితో కలిసి పనిచేసింది. అలా ఆమె పనిచేసిన ఇతర పార్టనర్స్‌తో కూడా ఆమెకు ఎన్నో ఎఫైర్లు ఉన్నట్లు ప్రచారాలు జరిగాయి. అవన్నీ నిజం కాదని సాక్ష్యం ఏంటి. చాలా మంది కొరియోగ్రాఫర్ల భార్యలు కూడా ఆమెకు వార్నింగ్‌లు ఇచ్చారని కూడా టాక్ ఉంది. కంప్లైట్ ఇచ్చిన మహిళ.. ఇప్పుడు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడటం లేదు? ఆమె పెట్టింది తప్పుడు కేసు కాబట్టే ముఖం దాచుకుని తిరుగుతంది’’ అని సుమలత వ్యాఖ్యానించారు.
రిమాండ్‌లో జానీ మాస్టర్
కేసు నమోదు తర్వాత జానీ మాస్టర్‌ను గోవాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గోవా కోర్టులో ట్రాన్సిస్ట్ ఆర్డర్స్‌తో అతడిని తెలంగాణకు తరలించారు. గోల్కొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు చేయించారు పోలీసులు. ఆ తర్వాత అతడిని కోర్టు ముందు హాజరు పరచగా న్యాయస్థానం అతనికి 14 రోజుల రిమాండ్ విధించారు న్యాయమూర్తి. అనంతరం జానీ మాస్టర్‌ను పోలీసులు హైదరాబాద్ జైలుకు తరలించారు. ప్రస్తుతం అత్యాచారం కేసుకు సంబంధించి జానీ మాస్టర్‌ను విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.