Mohanbabu |మోహన్ బాబు క్షమాపణ చెప్పాలి

జర్నలిస్టులపై దాడి చేసిన సినీనటుడు మోహన్ బాబు క్షమాపణ చెప్పాలని జర్నలిస్ట్ సంఘాలు డిమాండ్ చేశాయి.ఈ ఘటనను పలు జర్నలిస్ట్ సంఘాలు ఖండించాయి.

Update: 2024-12-10 16:06 GMT

జర్నలిస్టులపై దాడి చేసిన మోహన్ బాబు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలంగాణ రాష్ట్ర వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.ఈ ఘటనపై

ప్రభుత్వం వెంటనే స్పందించి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. మోహన్ బాబు ఇంటి వద్ద వీడియో జర్నలిస్టులు,రిపోర్టర్ల పై జరిగిన దాడిని తీవ్రంగా అసోసియేషన్ ఖండించింది.
పోలీసులు సమక్షంలో దాడి జరగడంతో జర్నలిస్టుల భద్రతకు భరోసా లేదని మరోసారి రుజువు అయింది దీనిపై ప్రభుత్వ పెద్దలు స్పందించాలని, దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.
- సినీ నటుడు మోహనబాబు అకారణంగా జల్ పల్లి లోని తన నివాసంలో మీడియా ప్రతినిధులపై దాడి చేయడాన్ని తెలంగాణ వర్కింగ్ జర్నలస్ట్ ఫెడరేషన్ ఖండించింది. కుటుంబ వివాదాల పట్ల ఫ్రస్టేషన్ తో ఉన్న మోహనబాబు జర్నలిస్తులపై దాడి చేయడం సరికాదని తెలంగాణ వర్కింగ్ జర్నలస్ట్ ఫెడరేషన్ అధ్యక్షులు మామిడి సోమయ్య,ప్రధాన కార్యదర్శి బి బసవపున్నయ్య అన్నారు. ఈ నేపథ్యంలో మీడియా ప్రతినిధులకు మోహన్ బాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని టీడబ్ల్యూజేఎఫ్ డిమాండ్ చేసింది.

- మీడియా ప్రతినిధులపై సినీ నటుడు మోహన్ బాబు చేసిన దాడిని హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (హెచ్ యూజే ) తీవ్రంగా ఖండించింది. ప్రజలకు, ప్రభుత్వాలకు మీడియా వారధిగా ఉంటుందని, సమాజానికి వాస్తవాలు చెప్పడం కోసం పాత్రికేయులు వృత్తి నిబద్దతతో పనిచేస్తారని హెచ్ యూజే అధ్యక్షులు బి అరుణ్ కుమార్, కార్యదర్శి బి జగదీశ్వర్ చెప్పారు. మీడియా ప్రతినిధులకు మోహన్ బాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని హెచ్ యూజే డిమాండ్ చేసింది. మోహన్ బాబుపై కేసు నమోదు చేయాలని కోరుతున్నట్లు హెచ్ యూజే డిమాండ్ చేసింది.
- జర్నలిస్టుపై దాడి చేసిన మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని టీయూడబ్ల్యూజే డిమాండ్ చేసింది. ఆయనపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని టీయూడబ్ల్యూజే కార్యదర్శి మారుతీసాగర్ డిమాండ్ చేశారు.


Tags:    

Similar News