కల్పనది ఆత్మహత్య కాదు..జస్ట్ నిద్రమాత్రలు ఎక్కువమింగిదంతే
ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్య చేసుకోలేదని జస్ట్ నిద్రమాత్రలు ఎక్కువగా మింగిందంతే అని సింగర్ కూతురు చెప్పింది;
ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్య చేసుకోలేదని జస్ట్ నిద్రమాత్రలు ఎక్కువగా మింగిందంతే అని సింగర్ కూతురు చెప్పింది. కల్పన మంగళవారం సాయంత్రం ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నట్లుగా జరుగుతున్న ప్రచారం అందరికీ తెలిసిందే. అపస్మారకస్ధితిలో ఉన్న కల్పన ఇంటి తలుపులను పోలీసులు పగలగొట్టి ఆమెను ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్ధితి నిలకడగానే ఉన్నట్లు డాక్టర్లు ప్రకటించారు. రెండురోజులుగా కల్పన(Singer Kalpana) ఇంటి తలుపులు తెరుచుకోకపోవటంతో చుట్టుపక్కల వాళ్ళకి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారనేది ఒక సమాచారం. ఇదేసమయంలో తాను అపస్మారకంలోకి వెళుతున్నట్లు మద్రాసులో ఉన్న భర్తకు ఫోన్ చేసి కల్పనే చెప్పగా భర్త వెంటనే స్పందించి కాలనీ సెక్రటరీకి ఫోన్ చేసి విషయం చెప్పినట్లు, సెక్రటరీ పోలీసులను పిలిపించినట్లు మరో టాక్ నడుస్తోంది.
సరే ఈ విషయాలు ఎలాగున్నా మద్రాసులో ఉన్న భర్త, కేరళ(Kerala)లో చదువుకుంటున్న కూతురు అర్జంటుగా హైదరాబాద్ చేరుకున్నారు. పోలీసులతో కల్పన కూతురు మాట్లాడుతు తన తల్లి ఆత్మహత్య(Kalpana Suicide) చేసుకోలేదని స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. రోజు వేసుకునే నిద్రమాత్రలనే అధికమోతాదులో వేసుకోవటం వల్లే అపస్మారకంలోకి వెళ్ళిందంతే అని కూతురు(Kalpana daughter) చెప్పింది. అయితే ఇక్కడ ఒక సందేహం ఏమిటంటే మాత్రల వల్ల నిద్రవస్తుందని తెలిసినా అధికమోతాదులో కల్పన ఎందుకు మాత్రలు వేసుకున్నది ? ఈ ప్రశ్నకు కూతురు సమాధానం చెప్పటంలేదు. తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని పదేపదే చెప్పింది. ఇదే నిజమైతే కేరళ నుండి హైదరాబాదుకు వచ్చేయమని కల్పన ఎంతోకాలంగా అడుగుతున్నా తాను ఎందుకు రావటంలేదు ? నిద్రమాత్రలు మింగకముందు కల్పనకు తనకు ఎందుకు గొడవైందన్న విషయాన్ని కూడా కూతురు చెప్పటంలేదు.
తన తల్లి మానసిక ఒత్తిడికి గురవుతోందని, నిద్రపట్టకపోవటంతోనే మాత్రలు వేసుకుంటోందన్నది కూతురు వాదన. ఇది కాసేపు నిజమే అనుకున్నా కల్పన మానసిక ఒత్తిడికి కారణం ఏమిటి ? అన్నప్రశ్నకు కూతురు దగ్గర సమాధానం లేదు. కల్పనకు రెండు వివాహాలు అయ్యాయి. కూతురు మొదటి భర్తకు పుట్టిన సంతానం. కేరళ నుండి కూతురును హైదరాబాదుకు వచ్చేసి తన దగ్గరే ఉండమని కల్పన చాలాసార్లు అడిగిందని ఈ విషయంలోనే తల్లీ, కూతుళ్ళకు మధ్య గొడవలువుతున్నట్లు పోలీసులు ప్రాధమికంగా గుర్తించినట్లు సమాచారం. వాస్తవం ఏమిటన్నది కల్పన నోరిప్పితే కాని తెలీదు.