బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెండ్

ఇప్పుడు కవిత ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి..;

Update: 2025-09-02 08:47 GMT

భారత రాష్ట్ర సమితి (BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha)  కు పార్టీ భారీ అధినేత కేసీఆర్ ఊహించని షాక్ ఇచ్చారు. పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఆయన నిర్ణయానికి పార్టీ సినియర్ నేతలు అంగీకారం తెలిపారు. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శులు టి రవీందర్ రావు, సోమా భరత్ కుమార్ లు ఒక ప్రకటన విడుదల చేశారు. 



కొంతకాలంగా పార్టీలో కీలక నేతల విషయంలో కవిత  చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఆ దూకుడే ఇప్పుడు తన సస్పెన్షన్‌కు కారణమైంది. కాళేశ్వరం నిర్మాణంలో తన్నీరు హరీష్ రావు,  జోగినపల్లి సంతోష్ అవినీతికి పాల్పడ్డారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. హరీష్ రావు కవితకు బావ అవుతారు. సంతోష్ కుమార్ మేనల్లుడు. వారిద్దరి మీద ఆమె చేసిన తీవ్రమయిన అవినీతి ఆరోపణ పార్టీలో కూడా తీవ్ర దుమారం రేపింది. కాళేశ్వరం నిర్మాణంపై సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను ఆమె నిర్ధారించినట్లు అయింది. వాళ్లిద్దరు కాళేశ్వరం కాంట్రాక్టర్ కంపెనీతో కుమ్మక్కయి భారీగా సొమ్ము చేసుకున్నారన్నది ఆమె ఆరోపణ. దీనిని ఆమె బహిరంగంగా విలేకరుల సమావేశంలో చెప్పడంతో బిఆర్ ఎప్ అంతర్గత కుమ్ములాట పతాక స్థాయికి చేరింది. అంతేకాదు, పార్టీ నేత కుటుంబం కూడా సంక్షోభంలో పడిపోయింది. కవిత ఇంకా ముందుకెళ్లి మరిన్ని విషయాలు వెల్లడించుకుండా ఉండేందుకు  కెసిఆర్ చర్యలు మొదలుపెట్టారు.

దీంతో మంగళవారం పార్టీ నేతలతో దాదాపు మూడు గంటల పాటు పార్టీ నేతలతో సమావేశమై కవితపై సస్పెన్షన్ వేటు వేయాలని కేసీఆర్ నిర్ణయించారు.

సస్పెన్షన్ వేటు తర్వాత కవితపై బహిష్కరణ నిర్ణయం కూడా ఉండవచ్చని బీఆర్ఎస్ నేతల సమాచారం.

కవిత ‘యువరాణి దర్జా’ ఎక్కడ గాడితప్పింది?

2024 లో మార్చిలో కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టు అయ్యేదాకా తెలంగాణ యువరాణి లాగావెలిగారు. 2014 తెలంగాణ వచ్చాక బిఆర్ ఎస్ రాజకీయాలను ఒక వైపు నుంచి కెసిఆర్ కొడుకు కెటిరామరావు, మరొక వైపు నుంచ కవిత శాసించారు. వాళ్లిద్దరు చెప్పిందే వేదం. కెటిఆర్ ప్రభుత్వంలోమంత్రి. రాష్ట్రమంతా ఆయన జాగీరు. కవిత లోక్ సభ ఎంపి (నిజామాబాద్ )గా ఢిల్లీకి మకాం మార్చారు. అక్కడ పార్టీ అంటే తానే అనే ఇంప్రెషన్ క్రియేట్ చేశారు. ఆమె స్థాపించిన తెలంగాణ జాగృతి అనే సాంస్కృతిక సంస్థ దాదాపు మరొక రాజకీయ పార్టీలాగా వైభవం సంసాధించింది. అంతేకాదు, ఆమె కు పోటీ గా మరొక మహిళ తయారు కాకూడదనే ఉద్దేశంతో కెసిఆర్ తొలి క్యాబినెట్ మహిళలకు చోటు ఇవ్వలేదు. ఇది చాలా విమర్శలకు గురయింది. ఆమె జాగృతి వెలగబెట్టిన దర్జా అంతా ఇంతాకాదు. ఆమె చేపట్టిన బతుకమ్మ పండగ కార్యక్రమాలకు ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసేంది. తెలంగాణ సంస్కృతి ప్రచారం పేరుతో ఆమె బతుకమ్మ పండగలను నిర్వహించేందుకు ప్రపందేశాలన్నీ తిరిగారు. ఈ దర్జా ఎంతవరకు వెళ్లిందంటే, కెసిఆర్ రాజకీయ వారసత్వం ఎవరికి దక్కుతుంది, కెటిఆర్ కా లేక కవిత కా అనే చర్చ మొదలయింది. ఈ ప్రచారంతో నిజంగానే ఆమె వారసత్వం మీద ఆశలు పెట్టుకుందని అదే కుటుంబలో విబేధాలు వచ్చేందుకు కారణమయిందని చెబుతారు.

2019లో రెండో విడత అధికారంలోకి వచ్చాక, కెసిఆర్ కుటుంబ సభ్యులు దర్జా ఇంకా పెరిగిపోయింది. కెసిఆర్ మేనల్లుడు జోగినపల్లి సంతోష్ కుమార్ రాజ్యసభ ఎంపి అయ్యారు. అయ్య ముఖ్యమంత్రి, కొడుకు క్యాబినెట్ మంత్రి, ప్రభుత్వంలో నెంబర్ టు, ఒక మేనల్లుడు మంత్రి, మరొక మేనల్లుడు రాజ్యసభ సభ్యడు, కూతురు యువరాణి. దీనితో ఉద్యోగాలన్నీ కేసిఆర్ కుటుంబానికే అనే విమర్శ మొదయింది. రాష్ట్రంలో పార్టీ తిరుగులేని శక్తి కావడంతో కవిత పైరవీలు ఢిల్లీ దాకా వెళ్లాయి. ఢిల్లీ ప్రభుత్వం లిక్కర్ పాలసీని ప్రభావితం చేయడం మొదలుపెట్టారు. చాలా మంది తెలుగు మద్యం వ్యాపారులకు వాళ్లకు లిక్కర్ షాపులు లైసెన్సులు ఇప్పించే పనిలోపడ్డారు. ఇక రాష్ట్రంలో కెసిఆర్ చేపట్టిన ప్రాజక్టులన్నీ ఆయనకుటుంటానికి ఏటిఎంలాగా ఉపయోగపడుతున్నాయనే విమర్శవచ్చింది. ప్రధాని మోదీ ఆ విమర్శ చేశారు. హోం మంత్రి అమిత్ షా అదే విమర్శ చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అదే దాడి చేశారు. ఇపుడు కాళేశ్వరం ప్రాజక్టు కాంట్రాక్టర్ తో కుమ్మక్మయిన హరీష్ రావు,సంతోష్ రావు నిజంగా దాన్నిఎటిఎంగా మార్చకున్నారని కవిత దాదాపు నిర్ధారించారు. అయితే, కవిత తక్కువేమీ తినలేదు. అటువైపు ఢిల్లీ లో ఎక్సెస్ శాఖ ఎటిఎం చేసుకోవాలనుకున్నారు. అది సక్సెస్ కాలేదు. లిక్కర్ పాలసీ, లిక్కర్ షాపుల కేటాయింపు ఒక స్కాం అయి కూర్చుంది. అందులో ప్రధానంగా వినిపించిన పేరు కవితదే, దానితో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టొరేట్ (ED) ఆమెను 2024 మార్చిలో అరెస్టు చేసింది. అంతే, అరెస్టు పార్టీని లోక్ సభ ఎన్నికల్లో నామరూపాలు లేకుండా మాయం చేసింది. ఇపుడు సస్పెన్షన్ ఏలా తయారవుతుందో చూడాలి. ఉద్యమ పార్టీ ఉద్యమ కుటుంబం, ఉద్యమ నేత మసక బారడడం తెలంగాణ ప్రజలంతా చూస్తున్నారు.

మొత్తానికి కెసిఆర్ కుటంబానికి, ఆయన నాయకత్వంలోని భారత రాష్ట్ర సమితికి మాయని మచ్చ ఎవరివల్లోపడలేదు. కుటుంబ సభ్యలు వల్లే పడింది. కూతురు స్వయంగా అవినీతి ముద్ర వేశారు.దీనిని పర్యవసానం ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News