బయ్యారం ఉక్కు పరిశ్రమపై బీజేపీ నోరు విప్పాలి.. కమిత డిమాండ్..
బయ్యారం ఉక్కు పరిశ్రమపై బీజేపీకి చిత్తశుద్ధి లేదంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు.
బయ్యారం ఉక్కు పరిశ్రమపై బీజేపీకి చిత్తశుద్ధి లేదంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ.. బయ్యారం ఉక్కు పరిశ్రమ విషయంలో తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని దుయ్యబట్టారు. ఈ పరిశ్రమ తాము అడుగున్న డిమాండ్ కాదని, రాష్ట్ర విభజన చట్టంలో కూడా ఇది ఉందని చెప్పారామే. ‘బయ్యారం ఉక్కు-తెలంగాణ హక్కు’ అని రాష్ట్ర ఉద్యమ సమయం నుంచే పోరాటం చేస్తున్నామని గుర్తు చేశారు. ఈ అంశంపై 2013లోనే ఆనాటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌కు కేసీఆర్ లేఖ రాశారని, అందుకు ఆనాటి కేంద్రం కూడా అంగీకారం తెలిపిందని అన్నారు. దాదాపు 1.41 లక్షలకు పైగా ఎకరాల్లో 300 మిలియన్ టన్నులకు పైగా ఐరన్ ఓర్ నిల్వలు బయ్యారంలో ఉన్నాయని, అక్కడ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కేసీఆర్ ఆలోచన చేశారని తెలపారు. కానీ కేంద్రంలో పదేళ్లుగా ఉన్న బీజేపా మాత్రం ఇందుకు ఏమాత్రం సహకరించడం లేదని, పైగా అడిగిన ప్రతిసారీ.. బయ్యారంలో ఇనుము ముడి పదార్థనం నాణ్యంగా లేదని, నాశిరకంగా ఉందంటూ కహానీలు చెప్తోందంటూ విమర్శలు గుప్పించారు కవిత.
కొత్తగా అడగట్లేదు
‘‘బయ్యారం ఉక్కు పరిశ్రమ కోసం కొత్తగా ఏమీ అడగట్లేదు. రాష్ట్ర విభజనకు ముందు నుంచే ఈ అంశం చర్చల్లో ఉంది. బీఆర్ఎస్ హయాంలో పలుమార్లు అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. రాష్ట్ర విభజన చట్టంలో కూడా బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని ఉంది. కేంద్రం ప్రభుత్వం ఏ పార్టీదైనా ఈ చట్టాన్ని మాత్రం అమలు చేయాల్సిందే. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో సీఎం సైతం ఈ అంశంపై కేంద్రాన్ని పలుసార్లు ఒత్తిడి చేశారు. కానీ ఫలితం లేకపోయింది. ఐరన్ ఓర్ నాణ్యంగా లేదని బీజేపీ కుంటి సాకులు చెప్తోంది. ఇక్కడ ప్లాంట్ ఏర్పాటు సాధ్యం కావడానికి మరో 100 టన్నుల ఐరన్ ఓర్‌ను ఛత్తీస్‌గఢ్ నుంచి తీసుకురావాడానికి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది’’ అని తెలిపారు.
కిషన్ రెడ్డి ప్రకటన బాధాకరం
తెలంగాణ పట్ల బీజేపీ ఏమాత్రం ప్రేమ, చిత్తశుద్ధి ఉన్నా వెంటనే బయ్యారం ఉక్కు పరిశ్రమకు ఓకే చెప్పాలని కోరారు. ఈ సందర్భంగా బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కాదంటూ పార్లమెంటు సాక్షిగా కిషన్ కుమార్ రెడ్డి ప్రకటించం అత్యంత బాధాకరణమని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలను గెలిపిసతే ఒక్కరు కూడా స్పందించడకోసం ఆలోచించాల్సిన విషయమేనని, ప్రస్తుతం మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గతంలో ఎంపీగా ఉన్న సమయంలో ఉక్కు పరిశ్రమను డిమాండ్ చేశారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఆయన కూడా ఈ విషయంపై నోరు పెదపడం లేదని, కేంద్రంలోనీ బీజేపీపై రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి బయ్యారం ఉక్కు పరిశ్రమ కలను నెరవేర్చాలని ఆమె కోరారు.