ఆ ఒక్కటే పెండింగ్... మరో ముగ్గురు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్..

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శనివారం తెలంగాణ భవన్‌లో కీలక నేతలతో సమావేశమయ్యారు. సికింద్రాబాద్, భువనగిరి, నల్గొండ పార్లమెంటు స్థానాలకు సంబంధించి చర్చించారు.

Update: 2024-03-23 14:07 GMT

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శనివారం తెలంగాణ భవన్‌లో కీలక నేతలతో సమావేశమయ్యారు. సికింద్రాబాద్, భువనగిరి, నల్గొండ పార్లమెంటు స్థానాలకు సంబంధించి చర్చించారు. ఏ నియోజకవర్గానికి ఎవరిని కేటాయించాలి అనే అంశంపై సుదీర్ఘ చర్చల అనంతరం ఈ మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.

సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌, భువనగిరి పార్లమెంట్ స్థానం నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన క్యామ మల్లేశ్‌, నల్గొండ పార్లమెంట్ స్థానానికి కంచర్ల కృష్ణారెడ్డిని ఎంపిక చేశారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ మూడు నియోజకవర్గాలతో కలిపి ఇప్పటివరకు 16 లోక్‌సభ నియోజకవర్గాలకు బీఆర్ఎస్ తమ అభ్యర్థులను ఎంపిక చేసింది. కేవలం హైదరాబాద్ నియోజకవర్గానికి మాత్రమే అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంది.

కాగా, సికింద్రాబాద్‌ నియోజకవర్గానికి పద్మారావు గౌడ్ ను ఎంపిక చేయడంతో ఈ నియోకజకవర్గంలో పోరు రసవత్తరంగా ఉండే అవకాశం ఉంది. ఓవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, మరోవైపు బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. ముగ్గురు కీలక నేతలు సికింద్రాబాద్ లోక్ సభ పోటీలో నిలవడంతో ఈ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారనే ఆసక్తి నెలకొంది.

బీఆర్ఎస్ 16 మంది అభ్యర్థుల జాబితా..

ఆదిలాబాద్ - ఆత్రం సక్కు 

పెద్దపల్లి - కొప్పుల ఈశ్వర్ 

కరీంనగర్ - బోయినపల్లి వినోద్ కుమార్ 

నిజామాబాద్ - బాజిరెడ్డి గోవర్ధన్ 

జహీరాబాద్ - గాలి అనిల్ కుమార్ 

మెదక్ - వెంకట్రామిరెడ్డి 

మల్కాజిగిరి - రాగిడి లక్ష్మారెడ్డి 

సికింద్రాబాద్ - పద్మారావు గౌడ్ 

చేవెళ్ల - కాసాని జ్ఞానేశ్వర్ 

మహబూబ్ నగర్ - మన్నే శ్రీనివాస్ రెడ్డి 

నాగర్ కర్నూల్ - ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ 

నల్గొండ - కంచర్ల కృష్ణారెడ్డి 

హైదరాబాద్ - పెండింగ్ 

భువనగిరి - క్యామ మల్లేష్

వరంగల్ - కడియం కావ్య 

మహబూబాబాద్ - మాలోత్ కవిత 

ఖమ్మం -  నామా నాగేశ్వరరావు 

హైదరాబాద్ - పెండింగ్ 


Tags:    

Similar News