సిరిసిల్ల టికెట్ కెటిఆర్ కు ఇవ్వడానికి కెసీఆర్ ఒప్పుకోలేదు

బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు;

Update: 2025-07-27 10:08 GMT

సిరిసిల్ల అసెంబ్లీ టికెట్ కొడుకు కెటీఆర్ కు ఇవ్వడానికి కెసీఆర్ అస్సలు ఒప్పుకోలేదని కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు సిఎం రమేష్ జోక్యంతో కెటిఆర్ టికెట్ తెచ్చుకున్నాడని అన్నారు. బిజెపిలో బిఆర్ఎస్ విలీన ప్రతిపాదన వచ్చిందని సిఎం రమేష్ చెప్పిన వ్యాఖ్యలు నిజమేనని కేంద్రమంత్రి బండి సంజయ్ అంగీకరించారు. అలాంటి విలీనాన్ని బిజెపి ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోదని ఆయన అన్నారు

బిఆర్ఎస్ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని ఆ పార్టీని నడపడం ఇక ఎవరితరం కాదని బండి సంజయ్ అన్నారు. బిఆర్ఎస్ అంటే అయ్యా , కొడుకు, కూతురు, అల్లుడు పార్టీ అని, ప్రజా సమస్యల కన్నా కుటుంబ ప్రయోజనాలే ఆ పార్టీకి ముఖ్యమన్నారు. అవినీతికి పెద్ద పీట వేస్తూ ప్రజాస్వామిక విలువలను బిఆర్ఎస్ పూర్తిగా పాతరేసిందని బండి సంజయ్ అన్నారు. కుటుంబ పార్టీగా మారిపోయిన బిఆర్ఎస్ లో కుటుంబ తగాదాలు గత పదేళ్ల నుంచి ఉన్నప్పటికీ ఇప్పుడిప్పుడే వెలుగులోకి వచ్చాయని ఆయన అన్నారు.బండి సంజయ్ బిఆర్ఎస్ పై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.




Tags:    

Similar News