తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కీలక బిల్లులు

తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో కీలక బిల్లులను ప్రవేశపెట్టాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. జాబ్ క్యాలెండరును ఈ సమావేశాల్లోనే ప్రకటించాలని రేవంత్ నిర్ణయించారు.

Update: 2024-07-23 08:18 GMT

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ప్రారంభం అయ్యాయి.కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే లాస్యనందిత మృతికి అసెంబ్లీ సంతాపం తెలిపింది. సంతాప తీర్మానాన్నిఆమోదించిన తర్వాత మొదటి రోజు సభ కార్యకలాపాలను వాయిదా వేశారు.

- హైదరాబాద్ గన్ పార్కు వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు.

- ఈ అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక బిల్లులను తీసుకురావాలని నిర్ణయించుకుంది.

- ఈ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ సమస్యల పరిష్కారంపై, నైపుణ్య విశ్వవిద్యాలయం స్థాపనతోపాటు పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది.విద్యాకమిషన్, రెవెన్యూ బిల్లులు ప్రవేశపెట్టనున్నారు.


ఉద్యోగాల క్యాలెండర్ విడుదల
ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క గురువారం 2024-25 బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.రైతు బంధు స్థానంలో రైతు భరోసా పథకం అమలుకు మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. రైతు బంధు, ఆసరా పెన్షన్‌లకు సంబంధించి ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించింది.ఈ అసెంబ్లీ సమావేశంలోనే ఉద్యోగాల క్యాలెండర్‌ను కూడా ప్రభుత్వం విడుదల చేయనుంది.

ఫిరాయింపుల అంశం లేవనెత్తాలని బీఆర్ఎస్ నిర్ణయం
గత ఆరు నెలల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన నేపథ్యంలో దీన్ని అసెంబ్లీలో లేవనెత్తాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం స్పీకర్ వారిని అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది.నిరుద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు,రైతు భరోసా నిధులను రైతు ఖాతాల్లో జమ చేయడంలో జాప్యం,ప్రజారోగ్యం దెబ్బతినడం వంటి వాటిపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ యోచిస్తోంది.

పదిరోజుల పాటు బడ్జెట్ సమావేశాలు
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పదిరోజుల పాటు నిర్వహించాలని బీఏసీ కమిటీ నిర్ణయించింది.25వతేదీన 9 గంటలకు జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో బడ్జెట్ కు ఆమోదం తెలుపనున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు కేసీఆర్ శాసనసభకు రానున్నారు. శాసనసభకు చెందిన బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశమై బడ్జెట్ సమావేశాల వ్యవధిని నిర్ణయిస్తుంది.జులై 25న భట్టి విక్రమార్క తన తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌ను సమర్పించనున్నారు.గత డిసెంబర్‌లో అధికారం చేపట్టిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం తొలి సారి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.


Tags:    

Similar News