‘ప్రభుత్వానికి కష్టమక్కర్లేదు’.. రేవంత్‌కు కేవీపీ లేఖ..

తన ఫామ్ హౌస్ అంశంపై సీఎం రేవంత్ రెడ్డికి కేవీపీ లేఖ రాశారు. తాను తన ఫామ్ ఫౌల్ కూల్చొద్దని ఎక్కడా చెప్పలదేని గుర్తు చేశారు.

Update: 2024-10-04 09:00 GMT

తన ఫామ్ హౌస్ అంశంపై సీఎం రేవంత్ రెడ్డికి కేవీపీ లేఖ రాశారు. తాను తన ఫామ్ ఫౌల్ కూల్చొద్దని ఎక్కడా చెప్పలదేని గుర్తు చేశారు. కేవీపీ ఫామ్ హౌస్ వ్యవహారంపై ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌లో కాకరేపుతున్నాయి. నిబంధనలను విరుద్ధంగా నిర్మించిన కేవీపీ ఫామ్ హౌస్‌ను కూల్చొద్దా అని రేవంత్ ప్రశ్చించడం అగ్నికి ఆజ్యం పోసినట్లు ఈ వ్యవహారాన్ని మరింత కీలకంగా మారింది. పలువురు ఇతర నేతల గురించి కూడా రేవంత్ మాట్లాడినా.. స్వయంగా కాంగ్రెస్ నేతగా ముద్ర పడిన కేవీపీని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలే ప్రస్తుతం కీలకంగా ఉన్నాయి. తాజాగా దీనిపై కేవీపీ స్పందించారు. తన వల్ల కాంగ్రెస్‌కు చెడ్డపేరు రావడం తనకు ఇసుమంత కూడా ఇష్టం లేదన్నారు. తన ఫామ్ హౌస్ నిజంగానే అక్రమంగా నిర్మించినది అయితే దానిని తానే కూల్చేస్తానని, ప్రభుత్వానికి అంత కష్టమొద్దని ఆయన సీఎంకు రాసిన లేఖలో తెలిపారు. పూర్తిగా తన ఖర్చులతోనే తన ఫామ్‌హౌస్ కూలుస్తానని కూడా స్పష్టం చేశారు. ఈరోజు సీఎంకు రాసిన లేఖలో కేవీపీ అనేక విషయాలను వివరించారు.

నాకు మినహాయింపులు వద్దు..

‘‘కాంగ్రెస్ పార్టీతో నాకు సుదీర్ఘమైన అనుబంధం ఉంది. ఇందిరా గాంధీ హయాంలోనే గాంధీభవన్ ఇన్‌ఛార్జ్‌గా పనిచేశాను. 33 ఏళ్ల వయసులోనే కాంగ్రెస్‌లో కలిసి నడిచా. ఉమ్మడి రాష్ట్రంలో రాజ్యసభ ఎంపీగా రెండుసార్లు అధికారంలోకి వచ్చాను. పార్టీని కూడా రెండు సార్లు అధికారంలోకి తీసుకోచ్చాం. కాంగ్రెస్ పార్టీ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను. స్వాగతిస్తాను. కానీ కాంగ్రెస్‌తో నాకున్న అనుంబంధాన్ని ఒక కాంగ్రెస్ సీఎంకు చెప్పుకోవాల్సి రావడం బాధాకరంగా ఉంది. అజీజ్ నగర్‌లో నా కుటుంబీకులు ఉంటున్న ఫామ్‌హౌస్ విషయంలో ప్రతిపక్షాలు నన్నో పావులా వినియోగించుకోవడం చాలా బాధగా ఉంది. అందుకే అధికారులను నా ఇంటికి పంపించి సర్వే చేయించండి. అక్రమాలు ఉన్న ప్రాంతాలను మార్క్ చేస్తే వాటిని నేను నా సొంత ఖర్చులతో కూల్చివేయిస్తాను. నాకు చట్టం నుంచి ఎటువంటి మినహాయింపులు వద్దు’’ అని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.

మూసీ ప్రక్షాళన ఇప్పుడిది కాదు..

మూసీ ప్రక్షాళన చేపట్టాలని వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయంలోనే ప్లాన్ చేసినట్లు కేవీపీ తన లేఖలో చెప్పారు. 2005లో దాదాపు రూ.908కోట్లతో సేవ్ మూసీ అనే పథకాన్ని కూడా ప్రారంభించామని గుర్తు చేశారు. కాగా ఇతర అభివృద్ధి పథకాలకు ఎక్కువ నిధులు అవసరం కావడంతో.. మూసీ ప్రక్షాళను వాయిదా వేసి ఆ నిధులను ఇతర పథకాల అమలుకు తరలించినట్లు చెప్పారు. అదే మూసీ ప్రక్షాళన ఇప్పుడు పట్టాలెక్కినట్లు తెలిపారు. కానీ ఎన్నో కలలో ప్రారంభించిన మూసీ ప్రక్షాళనను పూర్తి చేయలేకపోయామన్న బాధ తనకు ఇప్పటికి కూడా ఉందని ఆయన రాసుకొచ్చారు.

Tags:    

Similar News