మహబూబ్ నగర్ టిడి గుట్టల్లో చిరుత

స్థానికుల్లో భయాందోళనలు;

Update: 2025-07-17 14:32 GMT

మహబూబ్ నగర్ టిడి గుట్టల్లో చిరుత సంచారం కలకలం రేపింది. టిడి గుట్టల్లో చిరత తలదాచుకున్నట్లు సమాచారమందడంతో ఆటవీ శాఖ అధికారులు టిడి గుట్టలకు చేరుకున్నారు. ముళ్ల పందిని వేటాడి తిన్నట్టు గురువారం ఆటవీ అధికారులకు ఆనవాళ్లు దొరికాయి. గుట్టపై ఉన్న గుహలో చిరుత సంచరిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. చిరుతకు ఎరగా మేకను బంధించారు. మేకను తినడానికి వచ్చి ఆటవీ శాఖ అధికారులు అమర్చిన బోనులో చిరుత చిక్కే అవకాశముంది. చిరుత ప్రెగ్నెంట్ కావడం వల్ల గుట్టపై వచ్చే వారిపై దాడి చేసే అవకాశముందని ఆటవీ అధికారులు చెబుతున్నారు. ట్రాప్ కెమెరాల్లో చిక్కే అవకాశముందని చిరుత పాదముద్రలు కనిపించాయని అధికారులు చెబుతున్నారు. శుక్రవారం వరకు చిరుత జాడ దొరికే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News