డీజీపీ కార్యాలయం ముట్టడికి అయ్యప్ప స్వాముల యత్నం

పోలీసులకు అయ్యప్ప దీక్షపై పెట్టిన నిబంధనలను అన్యాయమన్న అయ్యప్ప భక్తులు.

Update: 2025-11-27 08:02 GMT

తెలంగాణ డీజీపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయ్యస్వాములు, బీజేవైఎం నేతలు డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ వాతావరణ వేడెక్కింది. వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, అయ్యస్వాములకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే డ్యూటీలో ఉన్న పోలీసులు యూనిఫాంతో పాటు దీక్ష మాలను ధరించడానికి వీళ్లేదని, అదే విధంగా దీక్షలో ఉన్నా యూనిఫాంనే ధరించాలి తాజాగా నిబంధనలు పెట్టారు. ఆ నిబంధనలు తీవ్ర చర్చలకు దారితీశాయి. పోలీసు శాఖ తీసుకొచ్చిన ఈ నిబంధనలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని అయ్యప్ప భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

వాటికి వ్యతిరేకంగానే వారు డీజీపీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఈ నిబంధనలను తొలగించాలని డిమాండ్ చేశారు. ‘‘ప్రతిసారి హైదరాబాద్‌లో వివాదం జరుగుతోంది. అయ్యప్ప మాల కోసం యూనిఫాం నిబంధనల్లో వెసులుబాటు ఇవ్వాలి. హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ కార్యాలయం ఇచ్చిన లేఖ తీవ్ర చర్చలకు దారితీస్తోంది. కంచన్‌బాగ్‌ ఎస్సై ఎస్‌. కృష్ణకాంత్‌పై ఎందుకు నోటీసులు జారీ చేశారనే ప్రశ్నించారు. డీజీపీ కార్యాలయం నుంచి ఉన్న మార్గదర్శకాల ప్రకారం అలాంటి వెసులుబాటు ఇవ్వడం సాధ్యం కాదంటూ అదనపు డీసీపీ (సౌత్‌ ఈస్ట్‌ జోన్) కె. శ్రీకాంత్‌ ఇచ్చిన వివరణను అన్ని స్టేషన్లకూ పంపారని తెలిపారు. ఈ విధానాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Tags:    

Similar News