24న మావోయిస్టుల దేశవ్యాప్త బంద్

ఆపరేషన్ కగార్ పేరుతో(Operation Kagar) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హత్యలు చేయటాన్ని నిరసిస్తు ఈనెల 18 నుండి 23వరకు నిరసన వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు గుర్తుచేసింది.

Update: 2025-10-21 02:45 GMT
Maoist bandh

మావోయిస్టుపార్టీ అక్టోబర్ 24వ తేదీన దేశవ్యాప్త బంద్ కు పిలుపిచ్చింది. దేశవ్యాప్త బంద్ ను విజయవంతం చేయాలని పిలుపిస్తు సోమవారం రాత్రి పార్టీ అధికారప్రతినిధి అభయ్ పేరుతో ఒకప్రకటన జారీచేసింది.(Maoist party) మావోయిస్టుపార్టీ నేతలను ఆపరేషన్ కగార్ పేరుతో(Operation Kagar) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హత్యలు చేయటాన్ని నిరసిస్తు ఈనెల 18 నుండి 23వరకు నిరసన వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు గుర్తుచేసింది. నారాయణపూర్ జిల్లాలోని మాడ్, బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్, కర్రెగుట్ట అడవులు, సుక్మా జిల్లా, పశ్చిమ సింగ్ భుమ్ జిల్లా, ఒడిస్సాలోని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు రాబోయే ఐదున్నరనెలలపాటు కొనసాగించనున్న ఆపరేషన్ కగార్ ను తక్షణమే నిలిపేయాలని పార్టీ డిమాండ్ చేశారు.

పార్టీ కేంద్రకమిటి సభ్యులు మనోజ్, విజయ్ తో పాటు పదిమంది మావోయిస్టులను పోలీసులు చుట్టుముట్టి చిత్రహింసలుపెట్టి చంపినట్లు పార్టీ మండిపడింది. కేంద్రకమిటి సభ్యులు కడారి సత్యనారాయణరెడ్డి, కట్టా రామచంద్రారెడ్డిని బిలాస్ పూర్లో పట్టణంలో పట్టుకుని మాడ్ అడవుల్లో చిత్రహింసలు చేసి చంపేసినట్లు ఆరోపించింది. ప్రజాపక్ష మేథావులను పట్టణప్రాంత నక్సలైట్లుగా ప్రభుత్వం ముద్రవేస్తోందని ఆరోపించింది. గడచిన 22 నెలలుగా దేశవ్యాప్తంగా 700 మంది విప్లవకారులను బలగాలు హత్యచేసినట్లు వివరించింది. 2026, మార్చి 31కి మావోయిస్టు రహిత దేశంగా మార్చేందుకు కేంద్రప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను పార్టీ ఖండించింది.

సెప్టెంబర్లో పార్టీకి చెందిన నలుగురు కేంద్రకమిటిసభ్యులను, రాష్ట్రకమిటి సభ్యులను ప్రభుత్వాలు హత్యలుచేయటానికి వ్యతిరేకంగా నిరసనవారాన్ని అమలుచేస్తున్నట్లు గుర్తుచేశారు. అలాగే 24వ తేదీన దేశవ్యాప్తంగా చేస్తున్న బంద్ ను విజయవంతం చేయాలని పిలుపిచ్చారు. నారాయణపూర్ జిల్లా, నేషనల్ పార్క్ అడవులు, కర్రెగుట్ట అడవులు, సుక్మాజిల్లా, ఝార్ఖండ్ పశ్చిమ సింగ్ భుమ్ జిల్లా, ఒడిస్సాలో ఆపరేషన్ కగార్ ను తక్షణమే నిలిపేయాలని కూడా అభయ్ లేఖలో డిమాండ్ చేశారు.

Tags:    

Similar News