18 కిలోల బంగారం దోపిడి

సూర్యాపేట నగల దుకాణంలో గ్యాస్ కట్టర్ లతో ప్రవేశించి..;

Update: 2025-07-21 07:32 GMT

సూర్యాపేటలోని సాయి సంతోషి నగల దుకాణంలో భారీ చోరీ సంభవించింది. ఏకంగా18 కిలోల బంగారం, రూ.22 లక్షల నగదు చోరీ జరిగింది. ఈ విషయాన్ని యజమాని సోమవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం రాత్రి దుకాణం వెనుక నుంచి గ్యాస్‌ కట్టర్‌తో షట్టర్‌ తొలగించి దొంగలు లోనికి ప్రవేశించినట్లు పోలీసులు చెప్పారు. ఘటనాస్థలికి పోలీసులు చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.నగల దుకాణంలో అమర్చిన సిసీటీవీ ఫుటేజిని పరిశీలిస్తున్నారు.

ఎన్ని సిసీ కెమెరాలు పెట్టినప్పటికీ దొంగలు భయం, భక్తి లేకుండా చెలరేగిపోతున్నారు. సాంకేతికత కొత్త పుంతలు తొక్కడంతో దొంగలు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. చట్టాలలో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకుని దొంగలు తమ పని కానిచ్చేస్తున్నారు. దొంగలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నప్పటికీ వారికి బెయిల్ సులభంగానే దొరుకుతున్నట్లు చాలా ఉదంతాలు తెలియజేస్తున్నాయి.

Tags:    

Similar News