గచ్చెబౌలి భూముల వివాదంపై స్పందించిన మోదీ

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోయిందని అన్నారు.;

Update: 2025-04-14 10:29 GMT

కంచె గచ్చిబౌలి భూముల వివాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. పచ్చని అడవులపైకి బుల్డోజర్లను పంపడంలో బిజీగా ఉందంటూ చురకలంటించారు. హర్యానాలో యమునా నగర్ ర్యాలీలో మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణలోని ప్రభుత్వం తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అభివృద్ధి అంటే పచ్చదనం లేకుండా ఎటుచూసినా అద్దాల మేడలు కనిపించేలా చేయడం కాదన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోయిందని, ఇప్పుడు కాంగ్రెస్ కళ్లకు ప్రజల అవసరాల కన్నా వాళ్ల స్వార్థమే కనిపిస్తోందని చురకలంటించారు. తెలంగాణ ప్రభుత్వం అడవులను నాశనం చేస్తుందని విమర్శించారు.

‘‘మంచి పనులు చేయాలని బీజేపీ ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్ మాత్రం తమ స్వార్థం కోసం అడవులను నాశనం చేస్తుంది. వన్యప్రాణాలు బలికొంటోంది. అటవీ భూముల్లో బుల్డోజర్లు నడుపుతున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రజలకు నమ్మకద్రోహం జరుగుతుంది. హిమాచల్‌ప్రదేశ్‌లో ప్రజలు ఆందోళనలో అభివృద్ధి కుంటు పడింది. కర్ణాటకలో విద్యుత్ నుంచి పాల వరకు ,బస్సు కిరాయి వరకు అన్ని రేట్లు పెరుగుతున్నాయి. కర్ణాటక ప్రభుత్వం రేట్లు, పన్నులు పెంచింది. కర్ణాటకను కాంగ్రెస్ సర్కార్.. అవినీతిలో నెంబర్ వన్ చేసింది. ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడుతూ బీజేపీ ముందుకు వెళ్తుంది. వికసిత్ భారత్ కోసం మా పార్టీ పని చేస్తుంది” అని అన్నారు.

Tags:    

Similar News