సీఎం రేవంత్‌కు మందకృష్ణ స్ట్రాంగ్ వార్నింగ్..
ఏపీ సీఎం చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ధి రేవంత్‌కు లేదన్న మందకృష్ణ.;
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పించన్‌దారులను కాంగ్రెస్ సర్కార్ మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తూనే దివ్యాంగుల పించన్‌ను రూ.6వేలు, ఆసరా పించన్‌ను రూ.4వేలకు పెంచుతామని హామీ ఇచ్చిన సంగతిని ఈ ప్రభుత్వం మరిచిందన్నారు. అధకారంలోకి వచ్చిన 20 నెలలు గడిచినా హామీ గురించిన ప్రస్తావనే రాకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. ప్రతినెలా పింఛన్‌దారులకు రూ.వెయ్యి కోట్ల చొప్పున అందాల్సి ఉందని, కానీ అందులో రూ.20వేల కోట్ల వరకు పట్టదారి పట్టిందని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని కూడా ఈ ప్రభుత్వం నెరవేర్చకపోవడం అత్యంత దారుణమని అన్నారు.
పింఛన్‌ను పెంచండి..
‘‘తీవ్ర వైకల్యం ఉన్నవారికి ప్రతినెలా ఇచ్చే పెంఛన్‌ను రూ.15 వేలకు పెంచండి. ఈ విషయంలో అధికార పక్షం చేస్తున్న అన్యాయంపై విపక్షం కూడా నోరుమెదపడంలేదు. తెలంగాణలో చేయూత ద్వారా పింఛన్ అందుకుంటున్నవారిని సర్కార్ మోసం చేసింది. ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా పింఛన్‌ను పెంచలేదు. ఏపీ సీఎం చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ధి రేవంత్ రెడ్డికి లేదు. చంద్రబాబు.. చెప్పినట్లే పింఛన్లు పెంచారు. కానీ రేవంత్ మాత్రం పింఛన్ల అంశాన్నే మర్చిపోయారు. నవంబర్ మొదటివారంలో మొత్తం 10 నెలల బకాయిలు కలుపుకుని పెంచిన పింఛన్‌లు ఇవ్వాలి. లేనిపక్షంలో మరో ఉద్యమం మొదలవుతుంది. అందుకు దివ్యాంగుల సమాజ చేయూతదారులందర్నీ ఉద్యమానికి సిద్ధం చేయడానికి ఎమ్మార్పీఎస్ పూనుకుంటుంది’’ అని వార్నింగ్ ఇచ్చారు.