కర్మను ఎవరూ తప్పించలేరు

పాతబస్తీ బోనాలు రంగం భవిష్యవాణిలో మాతంగి సంచలన వ్యాఖ్యలు;

Update: 2025-07-21 12:52 GMT

‘‘బాధ లేని ఇల్లు లేదు. ప్రతీ బాధకు ఆ వ్యక్తి చేసుకున్న కర్మ. పాపాలు చేస్తే పరిహారం తప్పదు. ఆ మహదేవుడైన శివుడు కూడా ఏమి చేయలేడు. ఎవరి కర్మను వాళ్లు అనుభవించాల్సిందే. కర్మను ఎవరూ తప్పించలేరు’’ పాతబస్తీ బోనాలు వేడుకల్లో ముగింపు ఘట్టమైన   భవిష్యవాణిలో అవివాహిత అనురాధ అన్నమాటలివి.

గతవారం సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ రంగం కార్యక్రమంలో స్వర్ణలత భవిష్యవాణిలో అగ్రహం ప్రదర్శిస్తే పాతబస్తీలో జరిగిన కార్యక్రమంలో అనూరాధ శాంతంగా నవ్వుతూ కనిపించారు. నా పిల్లలను చల్లగా చూసుకునే బాధ్యత నాది బాలకా అని చెప్పారు. ఐదు వారాలు వరుసగా నాకు సాక(నీళ్లతో నైవేద్యం) పెట్టండి అనూరాధ సూచించారు.పాడి పంటలు,వర్షాలు సమృద్దిగా పడతాయని ఆమె భవిష్యవాణిలో చెప్పారు.

హైదరాబాద్‌లోని పాతబస్తీ బోనాల వేడుకలు సోమవారంతో ముగిసాయి. బోనాలు మరుసటి రోజు పాతబస్తీ బోనాల ఉత్సవాలతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. పాత బస్తీ బోనాల ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు రంగం, భవిష్యవాణి కార్యక్రమం జరిగింది. మొదటి రోజు పెద్ద ఎత్తున మహిళలు అమ్మవారి దేవాలయాల ముందు బోనాలను సమర్పించారు. ఈ రోజు మధ్యా హ్నం తరవాత రంగం కార్య క్రమం జరగింది. అవివాహిత మహిళ అనురాధ పచ్చి కుండ పై నిలబడి భవిష్యవాణి వినిపించారు. లాల్ దర్వాజా వద్ద రంగం కార్యక్రామానికి ముందు పోతరాజు ప్రదర్శన గావు కార్యక్రమం జరిగింది. గావు పట్టిన తర్వాత అనురాధ రంగం చెప్పింది. లాల్ దర్వాజా సింహవాణి మహంకాళి ఆలయం వద్ద అనురాధ చెప్పే భవిష్య వాణిని వినడానికి తెలంగాణ జిల్లాల నుంచి వేలాది మంది కదిలివచ్చారు. లాల్ దర్వాజా వద్ద అనురాధ చెప్పే రంగం భవిష్యవాణి కోసం భక్తులు ఆసక్తిగా ఎదురు చూశారు.

లాల్ దర్వాజా వద్ద మాత్రమే కాకుండా ఓల్డ్ సిటీలోని ప్రముఖ ఆలయాల వద్ద రంగం కార్యక్రమం జరిగింది. ఇక ఘట్టాల ఊరేంగింపు కోసం పోలీస్ శాఖ ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేసింది. పెద్ద ఎత్తున సాయుధ పోలీసు బలగాలను అధికారులు మోహరించారు. అక్కన్న, మాదన్న ఆలయం వద్ద నుంచి ఏనుగుపై అమ్మవారి ఘటం ఊరేగింపు నిర్వహించారు. సాయంత్రం ఐదు గంటలకు హరిబౌలి అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయం వద్ద ఏనుగుపై మాతేశ్వరి ఊరేగింపు ప్రారంభం అయింది. ఈ ఊరేగింపుని అనుసరించి అన్ని ఆలయాల ఊరేగింపులు సాంస్కృతిక కార్యక్రమాలు, డప్పు, వాయిద్యాలతో నయాపూల్ ఢిల్లీ దర్వాజ వైపు ఘట్టాల ఉరేగింపు సాగింది.


ఘటాల ఉరేగింపు అలియా బాద్, ఉప్పుగూడ, గౌలిపుర, సుల్తాన్ శాయి, మీరాలం మండి, మేకలబండ మీదుగా  లాల్ దర్వాజా మోడ్‌కు అమ్మవార్ల ఘట్టాలు చేరుకున్నాయి. లాల్ దర్వాజా మోడ్ నుంచి శాలి బాండ, చార్మినార్ , గుల్జార్ హోజ్ మదినా, నయాపూల్, ఢిల్లీ దర్వాజా వద్ద ఘట్టాల ఉరేగింపు కొనసా గింది. పోలీస్ శాఖ భారీ బందోబస్తు నిర్వహించింది. మొత్తం ఊరేగింపు అడుగడుగున పోలీసు బందోబస్తు, నిఘా కెమెరాల నీడలో సాగింది. ప్రధాన ఊరేగింపు సాగే దారి పొడవునా పెద్ద ఎత్తున పారా మిలటరీ బలగాలు మొహరించాయి.

Tags:    

Similar News