జగిత్యాల ప్రభుత్వ పాఠ శాలలో క్షుద్రపూజలు

పసుపు, కుంకుమ, నిమ్మకాయలతో పూజలు

Update: 2025-10-04 12:59 GMT

తెలంగాణ జగిత్యాలలో ఓ పాఠ శాలలో వింత సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. జగిత్యాల పట్టణంలోని ధరూర్ లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. దసరా సెలవుల అనంతరం పాఠశాలలు శనివారం పునఃప్రారంభమయ్యాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు పాఠశాలకు చేరుకున్నప్పుడు అక్కడున్న దృశ్యాలు చూసి వారు నిశ్చేష్టులను చేసింది. పాఠశాల వాకిలిలో ముగ్గులు, పసుపు, కుంకుమలు ,నిమ్మకాయలు, మిరపకాయలు వేసి దీపం వెలిగించి ఉండటాన్ని చూసి విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళనకు గురయ్యారు. గతంలో చనిపోయిన పావురాన్ని పాఠశాల గంటకు వేలాడదీసినట్టు స్థానికులు గుర్తు చేశారు.

Tags:    

Similar News