ORR Contract | ఓఆర్ఆర్ కేసు,కేసీఆర్,కేటీఆర్‌లపై ఏసీబీ,ఈడీలకు ఫిర్యాదు

హైదరాబాద్ ఓఆర్ఆర్ కాంట్రాక్టు బాగోతంపై ఈడీకి తాజాగా ఫిర్యాదు అందింది. ఈ కేసులో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించి సిట్ ను ఏర్పాటు చేసింది.;

Update: 2025-01-09 08:04 GMT

హైదరాబాద్ ఓఆర్ఆర్ కాంట్రాక్టు వ్యవహారంలో(ORR Contract) తండ్రీకొడుకులైన అప్పటి సీఎం కేసీఆర్,అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్( KCR, KTR), ఇతరులపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు (Complaint to ED)కొత్తగా ఫిర్యాదు చేశారు.

- హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లపై రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే విచారణకు ఆదేశించింది. దీనికోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేస్తామని తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.
- టోల్ కాంట్రాక్టు దక్కించుకున్న ఐఆర్‌బీ ఇన్ ఫ్రా నుంచి బీఆర్ఎస్ పార్టీ నేతలు, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ , ఇతర పార్టీ నేతలు ఎన్నికల బాండ్లను స్వీకరించడం ద్వారా అవినీతికి పాల్పడ్డారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)కి కొత్త ఫిర్యాదు అందింది.

కాంట్రాక్టు దక్కాకే ఎన్నికల బాండ్లు
అక్రమంగా ఎన్నికల బాండ్ల పేరిట పార్టీ నిధులను స్వీకరించడానికి దుర్వినియోగం చేసినట్లు అనుమానిస్తున్నట్లు ఫిర్యాదులో బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ ఛైర్మన్ రాచార్ల యుగందర్ గౌడ్ ఆరోపించారు.ఈ టోల్ కాంట్రాక్టు, బాండ్ల వ్యవహారంలో అవినీతి, అధికార దుర్వినియోగం,మనీలాండరింగ్ నిరోధక చట్టం ఉల్లంఘన ఉన్నట్లు కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు.‘‘ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాకు సంబంధించిన అనుమానాస్పద లావాదేవీలు 2023వ సంవత్సరం ఏప్రిల్ 27వతేదీన జరిగాయి.ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) మౌలిక సదుపాయాల అభివృద్ధికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం 30 సంవత్సరాల నిర్వహణ ఒప్పందాన్ని మంజూరు చేసింది.

అలా కాంట్రాక్టు..ఇలా ఎన్నికల బాండ్లు
2023వ సంవత్సరం జులై 4వతేదీన ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా రూ.25 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను బీఆర్ఎస్ పార్టీ పేరిట కొనుగోలు చేసింది. 2023వ సంవత్సరం జులై 13వతేదీన బీఆర్‌ఎస్ ఈ ఎన్నికల బాండ్లను నగదుగా మార్చుకుంది. లావాదేవీల సమయం లాభదాయకమైన ప్రభుత్వ కాంట్రాక్టు పొందిన తర్వాత బీఆర్‌ఎస్‌కు గణనీయమైన ఆర్థిక సహకారం అందించడం కనిపించే క్విడ్ ప్రో-కో ఏర్పాటును బలంగా సూచిస్తుంది’’అని రాచర్ల యుగందర్ గౌడ్ తన ఫిర్యాదులో ఆరోపించారు.

కిటెక్స్ బాగోతం
2023వ సంవత్సరం సెప్టెంబరు 28వతేదీన కిటెక్స్ గార్మెంట్స్ రెండవ యూనిట్ రంగారెడ్డి జిల్లాలో ప్రారంభమైంది. 2023వ సంవత్సరం అక్టోబరు 12వతేదీన కిటెక్స్ రూ.10కోట్ల విలువైన ఎలక్ట్రోరల్ బాండ్లను కొనుగోలు చేసింది. ఇలా బాండ్ల కొన్న కొద్దిసేపటికే అప్పటి బీఆర్ఎస్ పార్టీ అక్టోబరు 16వతేదీన నగదుగా మార్చుకుంది. అదేవిధంగా వరంగల్ నగరంలో 20234 జూన్ 16వతేదీన మొదటి యూనిట్ పనిచేయడం ప్రారంభించగానే జులై 5వతేదీన రూ.15కోట్ల ఎన్నికలబాండ్లను కిటెక్స్ కొనుగోలు చేసింది. బీఆర్ఎస్ పార్టీ జులై 17వతేదీన ఈ బాండ్లను నగదుగా మార్చుకుంది.

ఈడీ, ఏసీబీలకు ఫిర్యాదు
ఇలా యూనిట్లు ప్రారంభించడం అలా ఎన్నికల బాండ్లు కొనడం, దాన్ని బీఆర్ఎస్ నగదుగా మార్చుకోవడంలో అక్రమాలు, అధికార దుర్వినియోగం జరిగిందని, దీనిపై దర్యాప్తు జరిపించాలని యుగందర్ గౌడ్ ఈడీని కోరారు. ఫార్ములా ఈ రేస్ మాత్రమే కాదు, ఓఆర్ఆర్ టోల్ లీజుపై కూడా విచారణ జరిపించాలని బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ ఛైర్మన్ రాచార్ల యుగంధర్ గౌడ్ ఏసీబీకి ఫిర్యాదు చేశారు.ఈడీ జాయింట్ డైరెక్టర్ కు కూడా రాచార్ల ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన క్విడ్ ప్రో కో అక్రమాలపై విచారణ జరిపించాలని సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్ శాంతికుమారిలకు ఆయన  ఫిర్యాధు పంపించారు.



Tags:    

Similar News