ఫోన్ ట్యాపింగ్ కు కెసీఆరే బాధ్యుడు: పిసిసి ప్రెసిడెంట్

‘సిట్’ పేర్లు వెల్లడించాలి..;

Update: 2025-06-22 12:53 GMT

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ మాత్రమే బాధ్యుడు అని ,ఈ కేసులో   ఎవరెవరి పేర్లు ఉన్నాయని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్ )ను పిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. కెసిఆర్, కెటీఆర్ ప్రమేయం తోనే కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాప్ అయ్యాయని ఆయన వెల్లడించారు. హైద్రాబాద్ లో జరిగిన మీడియా సమావేశంలో పిసిసి అధ్యక్షుడు ఫోన్ ట్యాపింగ్ పై మాట్లాడారు. కాంగ్రెస్ నేతల, పారిశ్రామికవేత్తల ఫోన్లు ట్యాప్ అయ్యాయని ఆయన ఆరోపించారు. ఈ కేసుతో సంబంధమున్న ప్రతీ ఒక్కరూ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు .


గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాలను కుదిపేసింది. ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు కైవసం చేసుకుని అధికారంలో రాగలిగింది. అధికారంలో వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని వదల్లేదు. అమెరికాలో ఉన్న A1 నిందితుడైన మాజీ ఐపిఎస్ అధికారి ప్రభాకర్ రావును రప్పించగలిగింది. ఇప్పటికే ప్రభాకర్ రావును ఐదు పర్యాయాలు విచారించి కీలక మైన సమాచారాన్ని రాబట్టింది. మాజీ డిజిపి ఆదేశం ప్రకారమే తాను ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ప్రభాకర్ రావు వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, ఆయన తనయుడు కెటిఆర్ పేర్లు వెల్లడించకపోవడంతో ఫోన్ ట్యాపింగ్   స కేసును కాంగ్రెస్ సీరియస్ గా తీసుకుంది. దర్యాప్తు సంస్థ అయిన సిట్ ను ఫోన్ ట్యాప్ అయిన వారి పేర్లను వెల్లడించాలని పిసిసి అధ్యక్షుడు ప్రశ్నించారు. అధికారంలో ఉన్నకాంగ్రెస్ పార్టీ నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని  కోరకుండా నేరుగా సిట్ ను ప్రశ్నించడం  చర్చనీయాంశమైంది.

Similar News