ప్రశాంతంగా ఆదివాసి తుడుందెబ్బ
జీవో 49 రద్దు చేయాలని ఆదివాసీల పిలుపు;
ఆదివాసి తుడుందెబ్బ ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగుతుంది. ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలైన సిపిఐ, సిపిఎంలు బంద్ కు పిలుపునిచ్చాయి. జీవో 49 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసిలు బంద్ కు పిలుపునిచ్చాయి. కవ్వాల్ ఆటవీ సంరక్షణ పేరిట ఇచ్చిన ఈ జీవోపై వివాదం కొనసాగుతోంది.
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ఉట్నూరు ఏజెన్సీలో బంద్ కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సులు డిపోల నుంచి బయటకు రాకుండా ఆదివాసులు అడ్డుకున్నారు. హోటళ్లు, వ్యాపార సముదాయాలు, విద్యాసంస్థలు మూతపడ్డాయి.
జీవో 49కు వ్యతిరేకంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం ఉదయం నుంచి ఒక్క దుకాణం కూడా తెరచుకోలేదు. బస్సులు కూడా బయటికి రాకపోవడంతో రాకపోకలు పూర్తిగా
స్థంభించిపోయాయి.నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లోనూ ఆదివాసీలతో బాటు ఆదివాసేతర ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఐదో షెడ్యూల్ ప్రాంతంలోని రాజ్యాంగంలో పొందుపరిచిన 1/70, పెసా, ఆదివాసి చట్టాలను, ఆదివాసీల అస్తిత్వాన్ని, ఆదివాసీల మనుగడను ఆదివాసిల హక్కులను ఉల్లంఘిస్తూ జీవో 49 తీసుకొచ్చిందని కమ్యూనిస్ట్ పార్టీలు ఆరోపించాయి. గ్రామసభల తీర్మానాలు లేకుండానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్రం భీం కన్జర్వేషన్ కారిడార్ పేరిట తీసుకువచ్చిన ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా బంద్‌కు ఆదివాసీ తుడుందెబ్బతోపాటు ఆదివాసి సంఘాలు పిలుపునిచ్చాయి