బాకారం ఫామ్ హౌజ్ లో పోలీసుల మెరుపు దాడి

పట్టుబడ్డ 51 మందిలో 40 మంది నైజీరియన్లే;

Update: 2025-08-15 09:57 GMT

రంగారెడ్డి జిల్లా బాకారంలోని ఓ ఫామ్‌ హౌస్‌లో పోలీసులు మెరుపు దాడి చేశారు. ఫామ్‌హౌస్‌లో పట్టుబడ్డ 51 మందిలో 40 మందికి పైగా నైజీరియన్లు ఉన్నట్లు ఈగల్ టీం, పోలీసులు గుర్తించారు. అక్కడ జరిగిన పార్టీలో డ్రగ్స్‌, గంజాయి వాడుతున్నట్లు పోలీసులకు ఉప్పందింది. దీంతో సోదాలు నిర్వహించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నిషేధిత డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్ లో

ఇటీవలె డ్రగ్స్ కేసుల్లో ఎక్కువ సంఖ్యలో నైజీరియా దేశస్థులే పట్టు బడటం గమనార్హం. అరెస్ట్ అయిన నైజీరియన్లు తిరిగి తమ దేశానికి వెళ్లకుండా కొత్త ట్రిక్కులు ప్లే చేస్తున్నారు. దీంతో వారి డిపోర్టేషన్ ప్రక్రియ వేగవంతంగా సాగడం లేదు. హైదరాబాద్ లో 2500 మంది నైజీరియన్లు ఉన్నారని పోలీసులు తెలిపారు. వారిలో 750 మందికి విసా గడువు తీరింది అని వాళ్లు చెబుతున్నారు. వీరిలో ఎక్కువగా స్టూడెంట్ విసాలపై హైదరాబాద్ కు వచ్చిన వారే. వీరిని తిరిగి నైజీరియా దేశానికి పంపిస్తే డ్రగ్స్ వినియోగం, రవాణా సమస్య కొంత మేర తగ్గవచ్చు. స్థానిక అమ్మాయిలను పెళ్లిళ్లు చేసుకుని వారి చేత వేధింపుల కేసు పెట్టించుకుని హైదరాబాద్ లో తిష్ట వేస్తున్నారు. కేసులు పెట్టగానే విషయం కోర్టు పరిధిలో వస్తుంది. 498 ఎ( వరకట్న వేధింపులు) సెక్షన్ క్రింద అరెస్టైన నైజీరియన్లు దాదాపు ఏడుగురు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. అరెస్ట్ అయిన నైజీరియన్లకు బెయిల్ దొరకడంతో మళ్లీ డ్రగ్స్ దందా మొదలు పెడుతున్నారు. వాళ్ల తీరు మాత్రం మారడం లేదు.

Tags:    

Similar News