తెలంగాణ పోలింగ్ లైవ్ అప్‌డేట్స్

Update: 2024-05-13 00:22 GMT
Live Updates - Page 4
2024-05-13 05:36 GMT

పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ లో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకున్న టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యులు మధుయాష్కి గౌడ్

2024-05-13 05:32 GMT

జూబిలీహిల్స్ ఓబుల్ రెడ్డి స్కూల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న జూనియర్ ఎన్టీఆర్ 

2024-05-13 05:23 GMT

మహిళా ఓటర్లకు సోనియాగాంధీ రిక్వెస్ట్..

"నా ప్రియమైన సోదరీమణులారా.. స్వాతంత్య్ర పోరాటం నుండి ఆధునిక భారతదేశ నిర్మాణం వరకు, మహిళలు అపారమైన సహకారం అందించారు. అయితే, నేడు మన మహిళలు తీవ్రమైన ద్రవ్యోల్బణం మధ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. వారి శ్రమకు, తపస్సుకు న్యాయం చేసేందుకు కాంగ్రెస్‌ విప్లవాత్మకమైన ముందడుగు వేసింది. కాంగ్రెస్‌ 'మహాలక్ష్మి' పథకం కింద నిరుపేద కుటుంబానికి చెందిన మహిళకు ప్రతి ఏడాది రూ.లక్ష అందజేస్తాం. మా హామీలు ఇప్పటికే కర్ణాటక, తెలంగాణలోని కోట్లాది కుటుంబాల జీవితాలను మార్చేశాయి. అది MNREGA, సమాచార హక్కు, విద్యా హక్కు లేదా ఆహార భద్రత.. కాంగ్రెస్ పార్టీ మా పథకాల ద్వారా లక్షలాది మంది భారతీయులకు బలాన్ని ఇచ్చింది. మా పనిని ముందుకు తీసుకెళ్లడానికి మహాలక్ష్మి తాజా హామీ. ఈ క్లిష్ట సమయంలో, కాంగ్రెస్ హస్తం మీతో ఉందని, ఈ చేయి మీ పరిస్థితిని మారుస్తుందని నేను మీకు హామీ ఇస్తున్నాను."


2024-05-13 05:20 GMT

లోక్ సభ ఎన్నికల సందర్భంగా హుస్నాబాద్ లోని ప్రభుత్వ జూనియర్ కాలేజిలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్.

2024-05-13 05:17 GMT

హీరో నాగ చైతన్య ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా పోలింగ్ బూత్ వద్ద ఉన్న అభిమానులు ఆయనతో ఫోటోలు తీసుకున్నారు. 

2024-05-13 05:12 GMT

నాగర్ కర్నూల్ లో గూడెం ప్రజల ఓటు బహిష్కరణ 

నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం అమరగిరి గ్రామం చెంచుగూడెం లో నాలుగు రోజులుగా విద్యుత్ రావడం లేదని ఓటింగ్ కు రాకుండా ఉన్నారు స్థానిక చెంచు సామాజికవర్గ ఓటర్లు. తమ కాలనీకి విద్యుత్ సమస్య పరిష్కరిస్తేనే ఓటు వేస్తామంటున్నారు. విద్యుత్ లేకపోవడంతో నాలుగు రోజులుగా చీకట్లనే ఉంటున్నామని, చిన్న పిల్లలతో ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. విద్యుత్ లేకపోవడంతో తాగునీటికి కూడా ఇబ్బందిగా ఉందని తెలిపారు. 

2024-05-13 04:57 GMT

కొండాపూర్ చిరాక్ ఇంటర్నేషనల్ స్కూల్ లో ఓటు హక్కును వినియోగించుకున్న టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దంపతులు.

2024-05-13 04:51 GMT

కరీంనగర్‌లో కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపీ బండిసంజయ్. 

2024-05-13 04:48 GMT

ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదు అయిన పోలింగ్ శాతం.. 9.51 శాతం.

అదిలాబాద్ 13.22

భువనగిరి 10.54

చేవెళ్ల 8.29

హైద్రాబాద్ 5.06

కరీంనగర్10.23

ఖమ్మం12.24

మహబూబాబాద్11.94

మహబూబ్నగర్10.33

మల్కాజిగిరి6.20

మెదక్10.99

నాగర్ కర్నూల్ 9.81

నల్గొండ12.80

నిజామాబాద్10.91

పెద్దపల్లి9.53

సికింద్రబాద్5.40

వరంగల్8.97

జహీరాబాద్12.88

సికింద్రబాద్ కంటోన్మెంట్..6.28

2024-05-13 04:48 GMT

ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు. జూబ్లీహిల్స్‌లోని ఓబుల్‌ రెడ్డి స్కూల్‌లో కుటుంబ సమేతంగా వచ్చి ఓటేసిన వెంకయ్య నాయుడు. 

Tags:    

Similar News