తెలంగాణ పోలింగ్ లైవ్ అప్‌డేట్స్

Update: 2024-05-13 00:22 GMT
Live Updates - Page 5
2024-05-13 04:16 GMT

ఐకాన్న స్టార్ అల్లూ అర్జున్.. జూబ్లీహిల్స్‌లో ఓటు వేశారు. అనంతరం నంద్యాల టూర్‌పై క్లారిటీ ఇచ్చారు. ‘‘నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం నాకు లేదు. ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి’’ అని కోరారు.

2024-05-13 04:02 GMT

తెలంగాణలో మొదటి గంటలో 9.51 శాతం పోలింగ్ నమోదు

2024-05-13 03:59 GMT

భూదాన్ పోచంపల్లి(మం) కనుముక్కల గ్రామంలో ఎన్నికలను గ్రామస్థులు బహిష్కరించారు. నిన్న కురిసిన వర్షం కారణంగా ధాన్యం తడిసి పోయింది. ఆ ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం విషయంలో తమకు స్పష్టమైనా హామీ ఇస్తేనే ఓటు వేస్తామని పోలింగ్ కేంద్రం దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్నారు.

2024-05-13 03:57 GMT

ఎన్నికల పోలింగ్ సరళిని సమీక్షిస్తున్న సీఈవో వికాస్ రాజ్

2024-05-13 03:47 GMT

ఓటు హక్కును వినియోగించుకోవడానికి భారీగా ప్రజలు తరలి వస్తున్నారు. దాదాపు ప్రతి పోలింగ్ బూత్ దగ్గరా ఓటర్లు బారులు తీరి కనిపిస్తున్నారు. వాతావరణం చల్లగా ఉండటమే ఇందుకు కారణమని ప్రజలు భావిస్తున్నారు. ఏది ఏమైనా ఓటర్లు అధిక సంఖ్యలో ఓట్లు వేయడానికి ఆసక్తి చూపడం మంచి పరిణామం అని అధికారులు అంటున్నారు.

2024-05-13 03:45 GMT

ఓటేసిన బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గొల్లపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో బూత్ నెంబర్ 274లో ఆయన తన కుంబీకులతో కలిసి ఓటు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు వేయాలని కోరారు.

2024-05-13 03:40 GMT

గౌలిగూడా, వాల్మీకి సమాజ్‌లోని బూత్ నెంబర్ 151 లో హైద్రాబాద్ పార్లమెంట్ బిఆరెస్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ తన కుటుంబ సభ్యులతో కలసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

2024-05-13 03:32 GMT

హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి కొంపల్లి మాధవి లత తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

2024-05-13 03:31 GMT

ఓటు హక్కును వినియోగించుకున్న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్



2024-05-13 03:21 GMT

ఓటేసిన ఈటెల రాజేందర్

మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు.




Tags:    

Similar News