ఇండియా నుంచి అమెరికాకు నిలిచిన పోస్టల్ సేవలున
ట్రంప్ దెబ్బ పోస్టల్ సేవలపైనా పడింది. ఇండియా నుంచి ఉత్తరాలు పంపడం ఇకపై కుదరదు..న;
By : The Federal
Update: 2025-08-23 12:44 GMT
ఇండియా, అమెరికా మధ్య సంబంధాలు నానాటికీ దెబ్బతింటున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయిల్, ఇండియన్ ఫిష్ ప్రాడక్ట్స్ పై సుంకాలు విధించింది. ఇండియా నుంచి రొయ్యల ఎగుమతి ఆగింది. కొన్ని రకాల బియ్యం ఎగుమతులు నిలిచాయి. తాజాగా ఇండియా, అమెరికా మధ్య పోస్టల్ సేవలు కూడా నిలిచిపోనున్నాయి.
ఆగస్టు 25 నుంచి అమెరికాకు వెళ్లే అన్ని పోస్టల్ ఐటెమ్స్ బుకింగ్‌ను ఇండియన్ పోస్టల్ విభాగం నిలిపివేస్తోంది. లెటర్స్, డాక్యుమెంట్స్, $100 విలువలోపు గిఫ్ట్ పార్సెల్స్‌కు మాత్రం అనుమతి ఉంది. ఇవి కూడా తాత్కాలికమే అంటున్నారు.
ఇండియా పోస్ట్ సమచారం ప్రకారం అమెరికాకు ఏదైనా పార్సెల్ లేదా లెటర్స్ పంపడంపై ఆంక్షలు విధించింది. అమెరికాకు పోస్టల్ సేవలు తాత్కాలికంగా నిలిపివేసింది.
అమెరికా తీసుకున్న కొత్త టారిఫ్ నిర్ణయం కారణంగా ఇది అమల్లోకి వచ్చింది. జూలై 30న US ప్రభుత్వం జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ నంబర్ 14324 ప్రకారం, ఇప్పటి వరకూ USD 800 వరకు వస్తువులకు ఇచ్చిన సుంకం మినహాయింపును తొలగించారు. దీని ప్రభావంతో విదేశాల నుంచి వస్తువులు పంపించడంపై ప్రభావం చూపుతోంది.
లెటర్స్, డాక్యుమెంట్స్ $100 విలువలోపు గిఫ్ట్ ఐటెమ్స్ మాత్రం పంపేందుకు అనుమతి ఉంది. ఇవి కూడా అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP), యునైటెడ్ స్టేట్స్ పోస్టల్ సర్వీస్ (USPS) నుంచి మరింత స్పష్టత వచ్చే వరకు మాత్రమే కొనసాగుతాయి. ఈ కొత్త ఆర్డర్ ప్రకారం అమెరికాకు వెళ్లే షిప్‌మెంట్స్‌పై డ్యూటీలు వసూలు చేయాల్సి ఉంటుంది. కానీ, ఈ డ్యూటీలను ఎవరు వసూలు చేయాలి? ఎలా వసూలు చేయాలనే విషయంలో ఇంకా స్పష్టత లేదు.
అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) ఆగస్టు 15న కొన్ని గైడ్‌లైన్స్ జారీ చేసినా, అవి పూర్తిగా స్పష్టంగా లేవు. అమెరికాకు వెళ్లే ఎయిర్ క్యారియర్స్ ఆగస్టు 25 తర్వాత పోస్టల్ కన్సైన్‌మెంట్స్‌ను స్వీకరించడానికి నిరాకరిస్తున్నాయి. టెక్నికల్, ఆపరేషనల్ సమస్యలు కూడా ఉన్నాయని వాళ్లు చెబుతున్నారు.
ఇప్పటికే అమెరికాకు పార్సెల్ బుక్ చేసి ఉంటే, ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఇప్పుడు పంపలేని పార్సెల్స్‌కు పోస్టేజ్ రీఫండ్ ఇస్తామని ఇండియా పోస్ట్ తెలిపింది.
ఈ కొత్త రూల్స్ వల్ల క్రాస్-బోర్డర్ ఈ-కామర్స్, వ్యక్తిగత షిప్‌మెంట్స్‌పై ఎక్కువ ప్రభావం పడనుంది.