Rappa..Rappa | తెలంగాణలోనూ రప్పా..రప్పా
బీఆర్ఎస్ ఎంఎల్ఏ గుంటకళ్ళ జగదీశ్ రెడ్డి(BRS MLA Jagadeesh Reddy)ని ఉద్దేశించే ఏర్పాటుచేసినట్లు అనుమానాలు పెరిగిపోతున్నాయి.;
ఆంధ్రప్రదేశ్ అధికార కూటమి-వైసీపీ మధ్య సంచలనం సృష్టించిన రప్పా..రప్పా డైలాగు పోస్టర్ ఇపుడు తెలంగాణ(Telangana)లో కూడా ఊపందుకుంది. నల్గొండ జిల్లాలోని సూర్యపేటలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttamkumar Reddy) పర్యటనలో మంత్రి మద్దతుదారులు ఏర్పాటుచేసిన భారీ ఫ్లెక్సీల్లో ‘ఉత్తమ్మన్నకు ఎవరు ఎదురొచ్చినా రప్పా..రప్పా..రప్పా..రప్పానే’ అని(Rappa..Rappa) రాసుండటం జిల్లాలో సంచలనంగా మారింది. మంత్రి మద్దతుదారులు ఎవరిపేరును ప్రస్తావించకపోయినా పరోక్షంగా మాజీమంత్రి, సూర్యాపేట బీఆర్ఎస్ ఎంఎల్ఏ గుంటకళ్ళ జగదీశ్ రెడ్డి(BRS MLA Jagadeesh Reddy)ని ఉద్దేశించే ఏర్పాటుచేసినట్లు అనుమానాలు పెరిగిపోతున్నాయి.
కొద్దిరోజులుగా మంత్రి-గుంటకళ్ళ మద్దతుదారుల మధ్య ఫ్లెక్సీల వార్ నడుస్తోంది. మంత్రిని విమర్శిస్తు ఈమధ్యనే బీఆర్ఎస్ మద్దతుదారులు కొందరు పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం కలకలంరేపింది. అప్పటి ఎంఎల్ఏ మద్దతుదారులు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలకు కౌంటరుగా ఇపుడు మంత్రి మద్దతుదారులు రప్పా..రప్పా అంటు ఏర్పాట్లుచేసిన ఫ్లెక్సీలు సంచలనంగా మారాయి. ఇందిరమ్మ ఇళ్ళ లబ్దిదారులకు మంజూరు పత్రాలు అందచేసే కార్యక్రమం కలెక్టరేట్ లో జరగబోతోంది. మంజూరు పత్రాలు మంత్రి ఇస్తున్నా లోకల్ ఎంఎల్ఏ హోదాలో ప్రోలోకాల్ ప్రకారం ఎంఎల్ఏ గుంటకళ్ళ కూడా హాజరవుతారని అంటున్నారు. ఈ నేపధ్యంలోనే రప్పా..రప్పా ఫ్లెక్సీల రాజకీయం వేడెక్కింది.
కలెక్టర్ కు వెళ్ళేదారిలో కాంగ్రెస్ నేతలు ఏర్పాటుచేసిన హోర్డింగులపై మంత్రి ఉత్తమ్ కు ఎదురొస్తే రప్పా..రప్పానే అంటు రాసుంది. అలాగే తెలంగాణ బెబ్బులి పులి-ఉత్తమ్ అన్న యువశక్తి పేరుతో ఈ హోర్టింగులు వెలిశాయి. ఆమధ్య బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మద్దతుగా రప్పా..రప్పా అంటు ఫ్లెక్సీ వెలిసినా వెంటనే దాన్ని తొలగించేశారు. మరి తాజా హోర్డింగులకు గుంటకళ్ళ మద్దతుదారులు ఎలా రియాక్టవుతారో చూడాల్సిందే.