Manchu family |మోహన్ బాబు, విష్ణు తుపాకీ లైసెన్సుల సీజ్‌కు సిఫార్సు
మంచు మోహన్ బాబు కుటుంబంలో రాజుకున్న ఘర్షణ రోజుకో మలుపు తిరుగుతుంది. రాచకొండ పోలీసులు మోహన్ బాబు, విష్ణుల గన్ లైసెన్సుల రద్దుకు రాచకొండ పోలీసులు సిఫార్సు చేశారు.;
మంచు మోహన్ బాబు కుటుంబంలో రాజుకున్న ఘర్షణ తీవ్రమవుతున్న నేపథ్యంలో రాచకొండ పోలీసులు అప్రమత్తం అయ్యారు. వార్తల కవరేజీకి వెళ్లిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి చేశారు. జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్ నుంచి మోహన్‌బాబు, విష్ణులు గన్ లైసెన్స్‌లు పొందారు. తాజా ఘర్షణల దృష్ట్యా సీరియస్ అయిన పోలీసులు ఇద్దరి తుపాకుల లైసెన్స్‌లను స్వాధీనం చేసుకోవాలని రాచకొండ పోలీస ఉన్నతాధికారులు ఆదేశించారు.
మోహన్ బాబు ఆడియో వ్యాఖ్యలు
మంచు మోహన్ బాబు కుటుంబంలో రాజుకున్న ఘర్షణ సినిమా సన్నివేశాలను తలపిస్తోంది. మంచు మనోజ్ తన ఇంటి సామాగ్రిని తీసుకొని జల్ పల్లి ఇంటి నుంచి వెళ్లిపోయారు. మనోజ్ పై మోహన్ బాబు ఆడియోలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘మనోజ్ నిన్ను అల్లారుముద్దుగా పెంచాను, నీ చదువుకోసం చాలా ఖర్చు పెట్టాను’’అని భావోద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు. ‘భార్య మాటలు విని నువ్వు నా గుండెలపై తన్నావని, తాగుడుక అలవాటు పడి చెడు మార్గంలో వెళుతున్నావు’’మోహన్ బాబు ఆరోపించారు.