భూ వివాదంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పోలీసుల అదుపులో

వివాదాస్పద భూమిలో కమర్షియల్ కాంప్లెక్స్;

Update: 2025-07-16 15:50 GMT

భూ వివాదంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆర్ పి సింగ్ ను సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన్ని నేరుగా సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీస్ స్టేషన్‌కు తరలించి.. విచారిస్తున్నారు. ఖాజాగుడాలోని సర్వే నెంబర్ 19 లోని 10. 32 గుంటల భూమికి తాము యజమానులమని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆర్పీ సింగ్, ఆయన భార్య హర్వీందర్ సింగ్ చెబుతున్నారు. ఆ క్రమంలో సదరు స్థలంలో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం ఐ టవర్ నిర్మాణ సంస్థతో ఆర్పీ సింగ్ అగ్రిమెంట్ చేసుకున్నారు.3ఎకరాల 24 గుంటల భూమి ఐ టవర్ కు గిప్ట్ చేసిన ఆర్పీసింగ్ ఆ తర్వాత క్యాన్సిల్ చేశారు. సదరు ఐ టవర్ కు చెప్పకుండానే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసి డెవలప్ మెంట్ కు ఇచ్చి 700 ఫ్లాట్లను ఆర్ పి సింగ్ విక్రయించారు. ఈ ప్లాట్లకు లోన్ రాకపోవడంతో యజమానులు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా ఐటవర్ ఫిర్యాదు మేరకు సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆర్ పి సింగ్ ను అరెస్ట్ చేశారు.

Tags:    

Similar News