Kishan Reddy | ‘ఇవేవీ సీఎం రేవంత్‌కు పట్టవా.. పట్టించుకోరా..?’

తెలంగాణలోని విద్యార్థులు, రైతుల, నిరుద్యోగులు, ప్రజల కష్టాలు సీఎం రేవంత్ రెడ్డికి పట్టవా? అని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

Update: 2024-11-27 11:49 GMT

కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి

తెలంగాణలోని విద్యార్థులు, రైతుల, నిరుద్యోగులు, ప్రజల కష్టాలు సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)కి పట్టవా? అని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) ప్రశ్నించారు. పురుగులన్న తినలేకున్నామం మహఆప్రభో అని గగ్గోలు పెడుతున్నా సీఎం రేవంత్‌కు చీమ కుట్టినట్లు కూడా అనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు పురుగులన్నం తినలేక పేద విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారని, మరోవైపు నాసిరకం ఆహారం వల్ల ఫుడ్‌పాయిజన్‌(Food Poison)కు గురై ప్రాణాలతో పోరాడుతున్నారని, ఇంతకన్నా దుర్భర దుస్థితితి విద్యార్థులకు రాకూడదని ఆయన అన్నారు. తెలంగాణ విద్యార్థుల దుస్థితి ఇంద దయనీయంగా ఉన్నా ఈ విషయం గురించి రేవంత్ ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. హైకోర్టు సైతం పాఠశాలల్లో తరచుగా సంభవిస్తున్న ఫుడ్ పాయిజన్ అంశంపై ఆగ్రహం వ్యక్తం చేసిందని, సీఎం హోదాలో ఉన్న రేవంత్ మాత్రం మౌన ముద్రను వీడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దృష్టి పాలనపై ఉంచిదే మంచిది

‘‘నాలుగైదు నెలలుగా.. రెసిడెన్షియల్ స్కూల్స్ లో చదువుకునే విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. అనేక రకాలుగా సంఘటనలు జరుగుతున్నాయి. విపక్షాలను తిట్టడం మీద పెట్టే దృష్టి పాలనమీద పెడితే రాష్ట్రం పరిస్థితి బాగుంటుంది. కానీ సీఎం దీన్ని పట్టించుకోవడం లేదు. కొమురం భీం జిల్లాలో శైలజ అనే అమ్మాయి.. హాస్టల్‌లో తిన్న ఆహారం వికటించడంతో ఆసుపత్రి పాలయింది. కొన్ని రోజుల పాటు చావుతో పోరాటం చేసిన ఆ చిట్టి తల్లి రెండు రోజుల క్రితం తన ఓటమిని అంగీకరిస్తూ తుది శ్వాస విడిచింది. ఈ విషయంపై సీఎం ఒక్క మాటైనా మాట్లాడారా?’’ అని నిలదీశారు.

‘‘ఇలాంటి వాటిపై సీఎం కనీసం దృష్టిపెట్టరు. సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయరు. సంబంధం లేని విషయాలపైనే ఆయనకు ఆసక్తి ఎక్కువ. అందుకే బీజేపీ తరపున.. రాష్ట్ర ప్రభుత్వానికి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా.. ఇప్పటికైనా నిర్మాణాత్మకంగా పాలనమీద దృష్టిపెట్టాలని కాంగ్రెస్‌ను, రేవంత్‌ను కోరుతున్నాను. రాజకీయ పరమైన ఆరోపణలు, ప్రత్యారోపణలతో తెలంగాణ నష్టపోతోంది. తెలంగాణ గతంలో బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్ కారణంగా నష్టపోతోంది. రాష్ట్ర రాజకీయ వ్యవస్థ భ్రష్టు పడుతోంది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులు, వ్యక్తిగత దాడులు.. అసాధ్యమైన అంశాల్లో.. ప్రజలను మభ్యపెట్టేలా పనులు చేయడంలో ఇద్దరూ ఇద్దరే. కాంగ్రెస్.. బీఆర్ఎస్ వాళ్లను చేర్చుకుంది. గతంలో బీఆర్ఎస్.. కాంగ్రెస్ వాళ్లను చేర్చుకుంది. దీని వల్ల వచ్చిన మార్పు ఏంటి.. అధికారం ఎవరికి ఇచ్చినా.. రెండు పార్టీల్లో ఉంటున్న నేతలు వారే కదా. ఈ ఫిరాయింపులతో చట్టాలకు తూట్లు పొడుస్తున్నారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సకాలంలో నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానం చెప్పినా.. స్పీకర్ మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాంగ్రెస్ టికెట్ మీద గెలిచిన వారు నిస్సిగ్గుగా బీఆర్ఎస్‌లో చేరి మంత్రులయ్యారు. ఇప్పుడు బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్‌లో చేరి మంత్రి పదవులు అందుకున్నారు. ఇంతకన్నా సిగ్గుమాలిన తనం ఇంకోటి ఉంటుందా? ఇంతకన్నా రికార్డులు, సాక్ష్యాలు ఇంకేం కావాలి’’ అని ఫిరాయింపులపై ధ్వజమెత్తారు.

Tags:    

Similar News