రేషన్ షాపులకు చేరిన సన్న బియ్యం.. చెప్పిన మంత్రి పొన్నం

తెలంగాణను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం. అభివృద్ధిలో దేశానికే తలమానికంగా నిలబెడతాం మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు.;

Update: 2025-03-29 09:24 GMT

తెలంగాణలో ప్రతి రేషన్ కార్డు లబ్దిదారులకు సన్నబియ్యం అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. అంతకన్నా ముందు కొత్త రేషన్ కార్డులు ఇస్తామని తెలిపింది. అదే విధంగా ఇప్పటికే కొత్త రేషన్ కార్డులకు అర్హులను గుర్తించింది. దీంతో ఇప్పుడు ప్రజల దృష్టి అంతా సన్నబియ్యంపైనే ఉంది. రేషన్ షాపుల్లో సన్నబియ్యం ఎప్పటి నుంచి ఇస్తారని ఎదురుచూస్తున్నారు. దీంతో ఉడాది నుంచి సన్నబియ్యం పంపిణీ ప్రారంభిస్తామని ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా రేషన్ షాపుల్లో సన్నబియ్యం ఇవ్వడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. హుస్నాబాద్ క్యాంప్ కార్యాలయంలో సమావేశం నిర్మించిన అనంతరం ఈ విషయాలపై మంత్రి స్పందించారు. ఇప్పటికే రేషన్ షాపులకు సన్నబియ్యం లోడ్ చేరిందని ఆయన చెప్పారు. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.

‘‘రేపు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణం ఉంటుంది. అందులో అందరూ పాల్గొనాలి. దాంతో పాటుగానే ప్రభుత్వం చాలా గొప్ప కార్యక్రమం ప్రారంభిస్తుంది. రేపటి నుండి తెలంగాణ వ్యాప్తంగా దొడ్డు బియ్యం స్థానంలో రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం అందించే కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ఇప్పటికే అన్ని చౌక ధరల దుకాణాలకు సన్న బియ్యం చేరాయి. దీనిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క,సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభం చేస్తారు. దేశంలోనే మొదటి సారి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది’’ అని తెలిపారు.

‘‘రేషన్ కార్డుదారులు హైదరాబాద్‌లొ ఎక్కడయినా రేషన్ బియ్యం తీసుకోవచ్చు. మొన్న శాసన సభలో ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించుకున్నం. రాబోయే కాలంలో తెలంగాణ లో ప్రారంభించుకునే కార్యక్రమాలు ఆమోదించుకున్నాం. 2024-25 ,2025-26 సంవత్సరానికి సంబంధించి ఇందిరమ్మ ఇళ్లు ప్రతి గ్రామానికి పారదర్శకంగా అర్హుల ఎంపిక జరుగుతుంది. హుస్నాబాద్ లో309 పోలింగ్ స్టేషన్ లు 160 కి పైగా గ్రామాలు ఉన్నాయి. ఏప్రిల్ నెలలో రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ జరుగుతుంది. రైతు భరోసా కార్యక్రమం ద్వారా రైతులకు డబ్బులు వేయడం జరుగుతుంది’’ అని చెప్పారు.

‘‘ఇందిరా భరోసా నిధులు మొదటి విడత పూర్తయ్యాయి. ఉగాది రోజు వెయ్యికి పైగా సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ గ్రామాల్లో జరుగుతుంది. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ లు & ఆర్డీవో లు ,పంచాయతీ సెక్రటరీ లతో గ్రామాల సమస్యల పై సమావేశాన్ని ఏర్పాటు చేశాం. గ్రామాల్లో ఎక్కడ కూడా నీళ్ళ కొరత ఉండకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చాం. గ్రామాల్లో ఏ సమస్య ఉన్న గ్రామ కార్యదర్శి ద్వారా జిల్లా అధికారుల దృష్టికి తీసుకురండి. సమస్య పరిష్కారం కాకపోతే నా దృష్టికి తీసుకురండి.తరువాత నిరసనలు చెప్పుకోండి. సీసీ రోడ్లు, EGS,పంచాయతీ రాజ్ ఆర్ అండ్ బి ద్వారా చేస్తున్నాం’’ అని వివరించారు.

‘‘కరీంనగర్ హుస్నాబాద్ నాలుగు లైన్ల రోడ్డు కు టెండర్ అయింది. మెడికల్ అండ్ నర్సింగ్ కాలేజి & లైబ్రరీ వచ్చిన స్థలాలు ఉండేలా ఏర్పాటు చేశాం. 75 సంవత్సరాల ప్రభుత్వ స్కూల్ ఉత్సవాల్లో పాల్గొన్నప్పుడు పలు సమస్యలు తీసుకొచ్చారు. వాటన్నిటినీ పరిష్కారం చేస్తున్నాం. డిసెంబర్ 4 న పెద్దపల్లి సిఎం.. శాసన సభలో శాతవాహన యూనివర్సిటీ కి ఇంజనీరింగ్ కాలేజి ఇవ్వాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. 100 రోజుల్లో శాతవాహన యూనివర్సిటీ కి హుస్నాబాద్ లో ఇంజనీరింగ్ కాలేజి మంజూరు అయింది. దీనిని మహా సముద్రం గండి వద్ద స్థల సేకరణ చేశాం..లేవలింగ్ చేస్తున్నాం.. స్టాఫ్ కి కూడా ఏర్పాటు చేస్తున్నాం.. పారిశ్రామిక కారిడార్ కి స్థల సేకరణ చేయడం జరిగింది.. అందరూ సహకరిస్తున్నారు వారికి ధన్యవాదాలు.. 9 సంవత్సరాల క్రితం అక్కన్నపేట మండలం ఏర్పడింది’’ అని గుర్తు చేశారు.

‘‘అక్కన్నపేట కి కోటిన్నర రూపాయలతో మండల కార్యాలయ భవనానికి మంజూరు అయ్యాయి. హుస్నాబాద్ టౌన్ లో అభివృద్ది జరుగుతుంది. ఎల్కతుర్తి జంక్షన్ అభివృద్ది చేస్తున్నాం. ఎక్కడ కూడా ఇళ్లలోకి వర్షపు నీరు రాకుండా చూడాలని అదేశించం..ఆదిశగా పనులు కొనసాగుతున్నాయి. డ్రైనేజీ సిస్టమ్ అభివృద్ది చేస్తున్నాం. హుస్నాబాద్ జంక్షన్ లో ప్రభుత్వ స్థలంలో అంబేద్కర్ విగ్రహం అభివృద్ది చేస్తున్నాం. ఫిష్ మార్కెట్ దగ్గర జంక్షన్ అభివృద్ది చేస్తున్నాం. ఎల్లమ్మ చెరువు నుండి రామవరం వరకు డబుల్ రోడ్డు అభివృద్ది చేస్తున్నాం. సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తాం. ఎల్లమ్మ చెరువు అభివృద్ది చేస్తున్నాం’’ అని వెల్లడించారు.

‘‘అరేపల్లి,పొట్లపల్లి ,కొత్త చెరువు,నాగారం చౌరస్తా వద్ద జంక్షన్ అభివృద్ది చేస్తున్నాం. రింగ్ రోడ్డు ,ఇతర అభివృద్ధి వేగంగా చేస్తాం. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నాం. ఈసారి గౌరవెల్లి లో నీళ్ళు నింపడంతో పాటు కాలువల భూసేకరణ వేగంగా జరుగుతుంది. కాలువలకు రైతులు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నా. 10 ఏళ్లుగా గత మంత్రి ఎందుకు తెచ్చుకోలేదు..మీకు చేత కాక. మీరు మెడికల్ కాలేజి లాస్ట్ లో తెచ్చారు. మెడికల్ కాలేజి కోసం నేను దీక్ష చేసి తెచ్చా. శాతవాహన యూనివర్సిటీ కి ఇంజనీరింగ్ లా కాలేజి తెచ్చా. కరీంనగర్ లో లా కాలేజి, హుస్నాబాద్ కి ఇంజనీరింగ్ కాలేజి మంజూరు అయింది. 10 సంవత్సరాల క్రితమే ఇంజనీరింగ్ కాలేజి స్టార్ట్ అయ్యేది మీ నిర్లక్ష్యం వల్లే ఆలస్యం అయింది. హుస్నాబాద్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో లేదా...? అక్కన్నపేట మండలంలో ఉన్న గ్రామాలు హుస్నాబాద్ మండలంలో గతంలో ఉన్న మాదిరి రావడానికి ప్రాసేస్ నడుస్తుంది’’ అని చెప్పారు.

Tags:    

Similar News