ఫోన్ ట్యాపింగ్ కేసు: శ్రావణ్‌కు రక్షణ కల్పించడానికి సుప్రీంకోర్టు ఓకే..
కోర్టు నోటీసులకు స్పందించిన ఆయన తిరిగి ఇండియాకు రావాల్సి ఉంటుందని, అందుకు మధ్యంతర రక్షణ కల్పించడం రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుస్తుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.;
ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక పలుపులు తీసుకుంటుంది. ఇందులో భాగంగా తెలుగు మీడియా ఔట్లెట్ ఎండీ ఆరువేల శ్రావణ్ కుమార్‌కు సుప్రీంకోర్టు గుడ్‌న్యూస్ చెప్పింది. ఆయనకు మధ్యంతర రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా విచారణకు పూర్తి సహకారం అందించాలని ఆదేశించింది.కేసు విచారణ కోసం ఆయన యూఎస్‌ఏ నుంచి ఇండియాకు రావడానికి అనుమతించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులోని నిందితుల్లో శ్రావణ్ కూడా ఒకరు. గతేడాది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని హైకోర్టు సుమోటోగా తీసుకుని విచారణకు ఆదేశించింది. ‘జాతీయ భద్రత’ ప్రమాదంలో ఉందని భఆవించి హైకోర్టు ఈ కేసును స్వీకరించింది.
ఈ కేసులో శ్రావణ్ కుమార్‌కు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తూ మార్చి నెలలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా స్పెసల్ లీవ్ పిటిషన్ దాఖలయింది. ఈ పిటిషన్‌ను జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడా ధర్మాసనం విచారిస్తోంది. ఈ క్రమంలోనే కుమార్ తరపు న్యాయవాది దామ శేషాద్రి నాయుడు కోర్టులో వాదనలు వినిపిస్తూ కుమార్‌కు ఎస్‌ఎల్‌పీ ఇవ్వాలని, అదే విధంగా మధ్యంతర రక్షణ కల్పించాలని కోరారు. ప్రభుత్వ తరపు న్యాయవాది మాత్రం ఈ అభ్యర్థనను తీవ్రంగా వ్యతిరేకించారు. కుమార్‌కు వ్యతిరేకంగా రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కాగా ‘‘నేను అధికారులకు అన్నివేళలా అందుబాటులో ఉన్నాను. వారికి లేఖ కూడా రాశాను. సెక్షన్ 41ఏ సీఆర్‌పీసీ కింద వాళ్లు నాకు ఒక్క నోటీసు కూడా పంపలేదు’’ అని శేషాద్రి నాయుడు చెప్పారు. దీనిపై స్పందించిన ప్రభుత్వ తరపు న్యాయవాది.. కుమార్ ఏడాదిగా పరారీలో ఉన్నాడని గుర్తు చేశారు.
ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి నాగరత్న.. ప్రభుత్వం కుమార్‌ను ఈరోజు అరెస్ట్ చేయగలదా అని ప్రశ్నించారు. అయితే కుమార్ ప్రస్తుతం అమెరికాలో ఉండటంతో అది సాధ్యం కాదని ప్రభుత్వం తరపు న్యాయవాది వివరించారు. దీంతో కుమార్ అప్పగింత ప్రక్రియను ప్రారంభించాలని, కోర్టు నోటీసులకు స్పందించిన ఆయన తిరిగి ఇండియాకు రావాల్సి ఉంటుందని, అందుకు మధ్యంతర రక్షణ కల్పించడం రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుస్తుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘‘కుమార్‌కు ఇప్పుడు రక్షణ ఇవ్వకపోతే ఆయన ఎప్పటికీ ఇండియాకు రారు. కాబట్టి ఆయనకు రక్షణ ఇవ్వనివ్వండి. విచారణకు రావాలని నోటీసులు అందితే.. ఆయన భారతదేశానికి రావాలి. పోలీసుల దర్యాప్తుకు పిటిషనర్ సహకరిస్తే.. తదుపరి విచారణ తేదీ వరకు అతనికి రక్షణ కల్పించడం న్యాయమైన చర్య అని మేము భావిస్తున్నాం. దర్యాప్తుకు ఆయన ఎప్పుడు రావాలని అన్న అంశాలను నిశ్చయించి దర్యాప్తు రావాలని అతనికి ఇచ్చిన సమచానికి కుమార్.. భారత్‌కు రావాలి. అతను దర్యాప్తుకు రావడాన్ని ప్రభుత్వం గమనించాల్సిన అవసరం ఉంది’’ అని జస్టిస్ నాగరత్న అన్నారు.
వెంటనే స్పందించిన శేషాద్రి నాయుడు.. కోరటు ఆదేశాలను తూచా తప్కుండా పాటిస్తామని, 48 గంటల్లో కుమార్ ఇక్కడ ఉంటారు’’ అని తెలిపారు.