బోనాలు, మొహర్రం ఉత్సవాల్లో ఈవ్ టీజర్లపై షీ టీమ్ యాక్షన్

బోనాలు, మొహర్రం ఉత్సవాల్లో ఈవ్ టీజింగ్ ఆగడాలు పెరిగాయి.;

Update: 2025-07-16 01:36 GMT
బోనాల ఉత్సవాల్లో ఈవ్ టీజర్ల ఆగడాలు

హైదరాబాద్ నగరంలో ఇటీవల జరిగిన బోనాలు, మొహర్రం ఉత్సవాల్లో(Bonalu,Moharram) ఆకతాయిలు పెట్టేగిపోయారు. అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగిన బోనాలు, మొహర్రం వేడుకల్లో యువతులు, మహిళలపై కొందరు ఆకతాయిలు ఈవ్ టీజింగ్ కు పాల్పడ్డారు. ఊరేగింపులు, బోనాల ఉత్సవాల్లో యువతులను ఆకతాయిలు లైంగికంగా వేధించారు. ఈ ఉత్సవాల్లో మఫ్టీలో ఉన్న షీటీమ్ బృందాలు ఈవ్ టీజర్ల వేధింపులను వీడియోలు తీసి వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.




 478 మంది ఈవ్ టీజర్లపై కేసులు

హైదరాబాద్ నగరంలో బోనాలు, మొహర్రం వేడుకల్లో యువతులను వేధించిన 478 మంది ఆకతాయిలపై షీటీమ్ (Hyderabad SHTeams)కేసులు పెట్టింది. యువతులను వేధిస్తుండగా 478 మందిని షీ టీమ్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.ఇందులో 386 మంది పెద్దలు, 92 మంది మైనర్లు కూడా ఉన్నారు. 288 మంది ఈవ్ టీజర్లను హెచ్చరించి వదిలేశారు.మరో నలుగురిపై కేసులు నమోదు చేసి వారికి జరిమానా విధించారు.మరో ఐదు కేసుల్లో ఒకరికి జైలు, జరిమానా విధించారు. మరో నలుగురికి జరిమానాలు విధించారు. ఈవ్ టీజర్లపై పలు పోలీసు స్టేషన్లలో (TelanganaPolice)కేసులు నమోదు చేశారు.



 ఈవ్ టీజింగ్ పై అవగాహన కార్యక్రమాలు

అమ్మాయిలను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని షీ టీమ్ హెచ్చరించింది. 124 అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఈవ్ టీజింగ్ నిరోధానికి షీ టీమ్స్ చర్యలు తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో 1405 పరిశీలనలు జరిపి ఈవ్ టీజర్లను హెచ్చరించింది. ఏవీ వాహనాలతో 352 అవగాహన ప్రచారం చేశారు. మహిళల భద్రత కోసం షీటీమ్స్ చర్యలు తీసుకుంటుంది.



 షీ టీమ్స్ హై అలర్ట్

హైదరాబాద్ నగరంలో బోనాల పండుగ సందర్భంగా షీటీమ్స్ హై అలర్ట్ ప్రకటించింది. గోల్కొండ బోనాలు, బల్కంపేట్ ఎల్లమ్మ ఆలయం, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ప్రధాన ఉత్సవాల సందర్భంగా షీ టీమ్స్ (SHE Teams) హై అలర్ట్‌ ప్రకటించి ఈవ్ టీజర్లపై నిఘా వేశాయి. ఇక్కడ మహిళా భక్తులతో అసభ్యంగా ప్రవర్తించి అనేక మంది నేరస్థులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. పండుగ సీజన్‌లో మహిళల భద్రతను (WomenSafety)పెంచడానికి హైదరాబాద్ నగరం అంతటా 14 ప్రత్యేక బృందాలతో షీ టీమ్స్ నిఘా వేసిందని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పారు.

సోషల్ మీడియాపై జాగ్రత్త
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ పట్ట అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని షీటీమ్ కోరింది. ఆన్ లైన్ లో ఎవరినైనా విశ్వసించే ముందు నకిలీ గుర్తింపుల పట్ల జాగ్రత్త గా ఉండాలని సూచించింది. సోషల్ మీడియా ఖాతాల్లో ప్రత్యేక మైన పాస్ వర్డ్ లను ఉంచుకోవాలని సూచించింది. ఆకతాయిలు అమ్మాయిలను వేధిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని షీటీమ్ హెచ్చరించింది.


Tags:    

Similar News