Revanth | ప్రజవాణిలో వికలాంగులడిని ఈడ్చిపారేసిన పోలీసులు
ఇంటికి వెళ్ళేందుకు సరైన దారేక వికలాంగుడు నానా అవస్తలు పడుతున్నాడు;
ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వంలో ప్రజావాణి కార్యక్రమంలో వికలాంగులు పాల్గొనకూడదా ? అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. కారణం ఏమిటంటే జగిత్యాల కలెక్టరేట్ లో తనబాధలు చెప్పుకుందామని వచ్చిన ఒక వికాలాంగుడిని పోలీసులు, సిబ్బంది బయటకు ఈడ్చిపారేశారు. ఇంతకీ అసలు జరిగింది ఏమిటంటే(Prajavani programme) ప్రజావాణిలో అధికారును కలిసి తన సమస్యలను చెప్పుకోవాలని రాజగంగారం అనే దివ్యాంగుడు జగిత్యాల కలెక్టర్(Jagityal Collector office) ఆఫీసుకు సోమవారం చేరుకున్నాడు. తన చక్రాలకుర్చీలో రాజగంగారం నానా అవస్తలుపడి కలెక్టరేట్ కు చేరుకున్నారు. ఆయన సమస్య ఏమిటంటే తనింటికి వెళ్ళేదారిలో రోడ్డుకు అడ్డంగా ఎవరో గోడను కట్టేశారు. దాంతో ఇంటికి వెళ్ళేందుకు సరైన దారేక వికలాంగుడు నానా అవస్తలు పడుతున్నాడు.
తన ఇంటికి వెళ్ళేదారిలో గోడను అడ్డంగా కట్టేసిన కారణంగా ఇంటికి నల్లా కనెక్షన్ ఇవ్వటానికి మున్సిపాలిటి వాళ్ళు నిరాకరిస్తున్నారు. ఇదేవిషయాన్ని కలెక్టరేట్ లోని అడిషినల్ కలెక్టర్ కు గతంలోనే చెప్పుకున్నా ఉపయోగం కనబడలేదు. తానురావటం అడిషినల్ కలెక్టర్ ను కలిసి సమస్య చెప్పుకోవటం తప్ప సమస్య పరిష్కారం కావటంలేదు. అందుకని రాజగంగారం సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ను కలిసేందుకు వచ్చాడు. అధికారులచుట్టూ ఎన్నిసార్లు తిరిగినా సమస్య పరిష్కారం కావటంలేదన్న కోపంతో నిరసన తెలపాలని బాధితుడు అనుకున్నాడు. అందుకని కలెక్టర్ రాకకోసం ఎదురుచూస్తున్నాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు, కలెక్టర్ ఆఫీసు సిబ్బంది కలిసి వికాలాంగుడిని వెళ్ళిపొమ్మని చెప్పారు. కలెక్టర్ ను కలిసి తన సమస్యను చెప్పుకోనిదే తాను కదిలేదిలేదని రాజగంగారం గట్టిగా బదులిచ్చాడు. దాంతో పోలీసులు, సిబ్బంది సాయంతో వికలాంగుడిని వీల్ చైర్ లోనుండి బయలకు లాగేసీ ఈడ్చుకెళ్ళి బయటపడేశారు. తర్వాత ఆయన వీల్ చైర్ ను కూడా బయటపడేశారు. ఈఘటనను చూసిన కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో విషయం సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ దగ్గరకు చేరింది. దాంతో స్పందించిన మంత్రి వెంటనే ఆర్డీవోకు ఫోన్ చేసి మంగళవారం రాజగంగారంను కలిసి సమస్యేమిటో తెలుసుకుని పరిష్కరించాలని ఆదేశించారు.