MLAs Disqualification | ‘స్వీకర్‌దే తుది నిర్ణయం’.. అనర్హత పిటిషన్‌పై న్యాయస్థానం

తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యేల అనర్హత విషయంలో తాము నిర్ణయం తీసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది.

Update: 2024-11-22 08:19 GMT

తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్ దక్కింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని తెలంగాణ హైకోర్టు(High Court) డివిజన్ బెంజ్ తెలిపింది. అసెంబ్లీ(Assembly) వ్యవహారాల్లో స్పీకర్‌దే తుది నిర్ణయం అని క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ సరికొత్త తీర్పును వెలువరించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నా ఆ విషయంలో తుది నిర్ణయం స్పీకర్‌దేనని స్పష్టం చేసింది న్యాయస్థానం. ఈ కేసు విషయంలో బీఆర్ఎస్‌(BRS)కు ఎదురుదెబ్బ తగిలినట్లయింది. దీంతో ఇప్పుడు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వ్యవహారంలో తుది నిర్ణయం తిరిగి తిరిగి అసెంబ్లీ స్పీకర్ దగ్గరకే చేరింది. ఈ పిటిషన్ వ్యవహారంలో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని, అతి త్వరలోనే తెలంగాణలోని పలు నియోజకవర్గాల్లో ఉపఎన్నిక జరగనుందంటూ ధీమా వ్యక్తం చేసిన బీఆర్ఎస్‌కు హైకోర్టు ఇచ్చిన తీర్పు భారీ షాక్‌గా మారిందని అంటున్నారు విశ్లేషకులు.

అయితే అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించి తుది నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్‌దేనని హైకోర్టు డివిజన్ బెంచ్ తేల్చి చెప్పింది. కాగా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం షెడ్యూల్ 10 ప్రకారం చర్యలు చేపట్టాలని సూచించింది. ఐదేళ్ల గడువు ఉన్న క్రమంలో స్పీకర్ నిర్ణయాలను నిర్దేశించలేమని వెల్లడించింది. ఈ తీర్పుతో రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్య అధికార విభజన ఉంటుందని, ఒక వ్యవస్థ వ్యవహారాల్లో మరో వ్యవస్థ జోక్యం చేసుకోవదని, చేసుకోవడం కుదరదని న్యాయస్థానం స్పష్టం చేసినట్లయింది.

అయితే 2023న జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచిన తర్వాత పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్‌లు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు.. అసెంబ్లీ స్పీకర్‌ను కోరారు. వారి విన్నపాన్ని స్పీకర్ పెండింగ్‌లో ఉంచారు. ఇంతలో ఈ విషయంపై త్వరగా నిర్ణయం తీసుకునేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద. వీరి పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు సింగిల్ బెంచ్ నెల రోజుల క్రితం ఒక తీర్పును వెలువరించింది.

అనర్హతను కోరుతూ బీఆర్ఎస్ నేతలు చేసిన అభ్యర్థనలు తన ముందుకు ఇంకా రాలేదని స్పీకర్ తెలిపారు. దీంతో పార్టీలు మారిన నేతలకు సంబంధించి దస్త్రాలను స్పీకర్‌కు వెంటనే అందించాలని అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. ఈ ఆదేశాలు ఛాలెంజ్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి.. హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టిన డివిజన్ కోర్టు.. సింగ్ బెంచ్ తీర్పును రద్దు చేసింది. అంతేకాకుండా అసెంబ్లీ వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోలేమని, ఎమ్మెల్యేల అనర్హత విషయంలో స్పీకర్‌దే తుది నిర్ణయం అని తేల్చి చెప్పింది.

Tags:    

Similar News