Srushti IVF | ‘సృష్టి’ హాస్పిటల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి సంఖ్య 200 పైమాటే

వెలుగు చూసిన కొత్త కోణం;

Update: 2025-08-07 16:08 GMT

సృష్టి స్కాంలో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తుంది. ఈ స్కాంలో ప్రధాన నిందితురాలైన డాక్టర్ నమ్రత కు చెందిన సృష్టి హాస్పిటల్లో కీలక రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. సంతాన భాగ్యం కలగాలని పిల్లలు లేని దంపతులు రిజిస్టర్ చేసుకున్న వారి సంఖ్య వెలుగు చూసింది. ఏకంగా 200 మందికి పైగా దంపతులు రిజిస్టర్ చేసుకున్న విషయాన్ని తెలుసుకుని పోలీసులు నిశ్చేష్టులయ్యారు. ఇప్పటివరకు 80 మంది శిశువులను పిల్లలు లేని దంపతులకు విక్రయించానని చెప్పుకున్న డాక్టర్ నమ్రత ఎంతమంది దంపతుల రిజిస్ట్రేషన్ జరిగిందో చెప్పలేదు. ఐదు రోజుల కస్టడీ సమయంలో కూడా డాక్టర్ నమ్రత ఈ విషయమై నోరు విప్పలేదు. అయినప్పటికీ గోపాలపురం పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తే కళ్లు బైర్లు కమ్మే నిజాలు వెలుగు చూసాయి. సృష్టి స్కాంలో ఇప్పటి వరకు 24 మంది అరెస్ట్ అయ్యారు. డాక్టర్ విద్యుల్లత విదేశాలకు పారిపోవాలని చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. పోలీసులు ఆమెను అదుపులో తీసుకున్నారు. ప్రభుత్వ డాక్టర్ అయిన విద్యుల్లత పేరిట డాక్టర్ నమ్రత అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి.

పేదగిరిజన పిల్లలే నమ్రత టార్గెట్. ఎందుకంటే పేద కుటుంబాల్లో ఉన్న ఆర్థిక సమస్యలను నమ్రత అవకాశంగా తీసుకునేవారు. 80 వేల రూపాయలకే శిశువులను కొనుగోలు చేసి రూ 30 నుంచి 50 లక్షలకు నమ్రత అమ్మేవారు.

ఈ పిల్లలను విక్రయిస్తున్న ముగ్గురు తల్లులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకు ఈ అక్రమ రవాణా జరిగిందని పోలీసులు గుర్తించారు.

శిశువులను అమ్మే గ్యాంగులతో సంబంధాలు

డాక్టర్ నమ్రతకు దేశ వ్యాప్తంగా నెట్ వర్క్ పెంచుకుంది. శిశువులను విక్రయించే ముఠాలనుంచి నమ్రత కొనుగోలు చేసేవారు. మహారాష్ట్ర, అహ్మదాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని పిల్లలను దొంగతనం చేసే గ్యాంగులతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ గ్యాంగుల నుంచి పిల్లలను కొనుగోలు చేసి.. సరోగసి పేరిట సంతానం కావాలని కోరే దంపతుల నుంచి భారీ మొత్తాలను వసూలు చేసినట్లు వెల్లడైంది. దీనితో పాటు.. సికింద్రాబాద్‌కు చెందిన ఒక గైనకాలజిస్ట్ లెటర్ హెడ్‌లను వాడుతూ నకిలీ ఇంజక్షన్లు, మందులు ఇచ్చినట్లు కూడా విచారణలో తేలింది. బాధితుల ఫిర్యాదు మేరకు ఆ గైనకాలజిస్ట్ నమ్రతపై కేసు పెట్టారు. తాజాగా ఆమె బ్యాంకు ఖాతాలు సీజ్ అయ్యాయి.

Tags:    

Similar News