GOOD TO GRAB: అగ్గువగా హైదరాబాద్ రెస్టరాంట్ల ఫుడ్, ధర సగమే...
హైదరాబాద్ రెస్టారెంట్లలో సాగుతున్న ఆహార వృథానుంచి సగం ధరకే ఫుడ్ అందించేందుకు ఇద్దరు టెకీలు ముందుకు వచ్చారు.;
హైదరాబాద్ (Hyderabad) నగరానికి చెందిన పిట్ల సాయికిషోర్, అనుగు శ్రీకాంత్ రెడ్డిలిద్దరూ స్నేహితులు. వీరికి యూకే (లుక్) లో ఉన్నత చదువులు చదవడంతో అక్కడే మంచి ఉద్యోగం లభించింది. చేస్తున్న ఉద్యోగం సంతృప్తి ఇవ్వక పోవడంతో వీరిద్దరూ వారి ఉద్యోగాలను వదిలి, యూకేకు గుడ్ బై చెప్పి స్వదేశానికి తిరిగి వచ్చారు. యూకేలోని హోటళ్లలో మిగులు ఆహారాన్ని అవసరమైన వారికి సగం ధరలకే విక్రయించే ఆన్‌లైన్ సంస్థలుండటం చూశారు. హైదరాబాద్ నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీల్లో వేల మెట్రిక్ టన్నుల ఆహారం ప్రతీ రోజూ చెత్తకుండీల పాలవుతుండటం చూశారు. అంతే సామాజిక బాధ్యతగా తీసుకొని ఇలా ఆహారం వృథా కాకుండా నగరంలోని రెస్టారెంట్లలో మిగులు ఉన్న మంచి ఆహారాన్ని సగం ధరకే విక్రయించేందుకు వీలుగా ‘గుడ్ టు గ్రాబ్’ (Good to Grab) పేరిట ఓ సంస్థను ఏర్పాటు చేశారు.దీని కోసం ప్రత్యేకంగా ఓ యాప్ (App) ను రూపొందించి రెస్టారెంట్లు, బేకరీలు, కస్టమర్లను ఆన్ లైన్ ద్వారా కలిపి ఆహార వృథాకు తెర వేశారు. స్టార్టప్ కంపెనీని పెట్టి పలువురు ప్రముఖుల ప్రశంసలందుకున్న యంగ్ తరంగ్‌లు సాయి కిషోర్, శ్రీకాంత్ రెడ్డిలు సాగిస్తున్న విజయయాత్రపై నగరంలో ఇపుడు హాట్ టాపిక్ అయింది.
మేం కలిసి చదువుకున్నాం...
మిగులు ఆహారం విక్రయం ఎప్పుడంటే...
గుడ్ టు గ్రాబ్ కు అవార్డు