కాలం ఎంత మారింది, తెలంగాణ అసెంబ్లీ ప్రతిపక్షంలో కెసిఆర్

తొలి బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం. పిబ్రవరి పదో తేదీన తెలంగాణ వార్షిక బడ్జెట్ సభ ముందుకు వస్తుంది.

Update: 2024-02-08 03:28 GMT

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ సమావేశాల్లో చాలా విశేషాలుంటాయి. అన్నింటికంటే ముఖ్యమయింది, పదేళ్లు తెలంగాణను పాలించి, మరొక ఇరవైయేళ్లు పరిపాలించాలని ధీమాగా ఉండిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రతిపక్షంలో  కూర్చుంటారు. ఇది ఒక అనూహ్య పరిణామం. ఎవరూ వూహించనిది. 2024 తర్వాత ఆయన ఎపుడూ ప్రతిపక్షంలోె కూర్చోలేదు. కేంద్రంలో  యుపిఎ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. తర్వాత రాజీనామా చేశారు తప్ప ప్రతిపక్షంలో కూర్చోనే లేదు. 2014 లో టిఆర్ ఎస్ విజయంసాధించడంతో ఆయన ఏకంగా ముఖ్యమంత్రి అయ్యారు. ఇపుడు 2023 ఎన్నికల్లో పరాజయం ఎదుర్కొన్ని  ఆయన ప్రతిపక్షంలో ఒక ఎమ్మెల్యేగా కూర్చోవడం  ఈ సమావేశాల విశేషం. హోదాకి ప్రతిపక్షనాయకుడయినా, అసలు ప్రతిపక్షంలోకి రావడం వింత.  అధికారంలో ఉన్నపుడు  ప్రతిపక్షంలో కూర్చున్న వారిని ఎపుడూ ఎద్దేవా చేయడం, సానుభూతితో చూడటమో ఆయనే చేసేవారు. ఇపుడు ఆయన ప్రతిపక్షంలో కూర్చున్నపుడు ఏమి జరుగుతుందో చూడాలి. 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమంటారు, ఆయనేం సమాధానం చెబుతారు,అధికార పక్ష సభ్యులు ఎలా గోల చేస్తారు, విపక్ష సభ్యులు ఎలా తిప్పికొడతారు, అనేవి ఈ సమావేశాలు విశేషాలు


ఈ రోజు అంటే ఫిబ్రవరి  8న  ఉభయసభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ తమిళి సై ప్రసంగిస్తారు.


దీనికోసం  ఉదయం 11:30 గంటలకు శాసనసభ సభా హాల్లో సంయుక్త సమావేశవుంతుంది.

గవర్నర్ ప్రసంగం అనంతరం శాసనసభ, మండలి రేపటికి వాయిదా పడతాయి.

సభలు వాయిదా పడిన తర్వాత బిజినెస్ అడ్వైజరి కమిటీలు అసెంబ్లీ, మండలి లో వేరువేరుగా సమావేశాలు అవుతాయి.

బడ్జెట్ సమావేశాల పని దినాలు, ఎజెండాను బీఏసీ భేటీలో ఖరారు చేస్తారు.

గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీ, కౌన్సిల్​లో రేపు చర్చ జరుగుతుంది అనతరం ప్రభుత్వ సమాధానం ఉంటుంది

పదవ  తేదీన 2024-25 రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను ప్రభుత్వం ఉభయసభల్లో ప్రవేశపెట్టనుంది.

మెడిగడ్డ లో అవినీతి, కృష్ణా ప్రాజక్టులను కేంద్రానికి అప్పగించే విషయం వంటి  నీటి పారుదల అంశాలతో సమావేశాలు వాడీవేడిగా సాగనున్నాయి.

నీటి పారుదల రంగానికి సంబంధించి ఈ సమావేశాల్లో శ్వేతపత్రం ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి ఇప్పటికే ప్రకటించారు.

KRMB కి శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల ఔట్ లెట్లను అప్పగించే విషయమై రాష్ట్రంలో రాజకీయ దుమారం కొనసాగుతోంది. నల్గొండలో బిఆర్ ఎస్ బహిరంగ సభతో కదనశంఖం పూరిస్తున్నారు.  గత ఎన్నికల తర్వాత కెసిఆర్ మాట్లాడుతున్న తొలి సభ ఇదే. 

అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్, బిజెపిలు  రానున్న జనరల్ ఎన్నికల దృష్ట్యా బిగ్గరాగా అరుస్తూ  పరస్పరం విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటు అసెంబ్లీలో రణరంగం సృష్టించవచ్చు.

KRMB పై అన్ని అంశాలపై శాసనసభ వేదికగా పూర్తిస్థాయిలో చర్చిద్దామని సీఎం రేవంత్​రెడ్డి స్పష్టం చేశారు.

ప్రతిపక్ష గులాబీ పార్టీ సైతం చర్చకు సిద్ధమని తెలిపింది.

కృష్ణా జలాల పరిరక్షణ పేరిట 13వ తేదీన నల్గొండలో భారీ బహిరంగ సభకు కూడా గులాబీ పార్టీ పిలుపునిచ్చింది.

నీటిపారుదలపై చర్చతో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వేడెక్కనున్నాయి.

మరో రెండు గ్యారంటీల అమలుకు సంబంధించి ముఖ్యంగా రు. 500 సిలిండర్, 200 యూనిట్ల కరెంటు వంటి వాటిపై  కూడా ఈ సమావేశాల్లోనే సీఎం ప్రకటన చేయనున్నారు.

బీసీ కులగణన కోసం ప్రత్యేక బిల్లును కూడా ఉభయసభల్లో ప్రవేశపెట్టనున్నారు

మరికొన్ని ఇతర బిల్లులు,శాసనసభ, మండలి ముందుకు రానున్నాయి.

Tags:    

Similar News