అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ఫిక్స్.. బడ్జెట్ అప్పుడే..

15 నెలల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై చర్చించడానికి ఈ సమావేశాల్లో అవకాశం ఉంది. ప్రతిపక్షాల విమర్శలను ధీటుగా ఎదుర్కోవాలి. సభ్యులు తప్పకుండా సభకు రావాల్సిందే.;

Update: 2025-03-12 10:45 GMT

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వేళయింది. బడ్జెట్ ప్రవేశపెట్టడం కోసం అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించారు. ఈరోజు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించి గవర్నర్ ఈ సమావేశాలను ప్రారంభించారు. అనంతరం అసెంబ్లీ సమావేశాలను ఎన్నిరోజులు నిర్వహించాలి, ఏయే అంశాలపై నిర్వహించాలి వంటి అంశాలను చర్చించడం కోసం సీఎం రేవంత్ అధ్యక్షతన సీఎస్పీ సమావేశం నిర్వహించారు. ఇందులో పలు కీలక అంశాలను చర్చించారు. ఈ సమావేశంలో అసెంబ్లీలో వ్యవహరించాల్సిన విధానాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచనలు చేశారు సీఎం.

‘‘ప్రజా ప్రభుత్వంలో ఇవి రెండో పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు. ఈ బడ్జెట్ సమావేశాలు అత్యంత కీలకమైనవి. 15 నెలల్లో ప్రజా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై పూర్తిగా చర్చించుకునేందుకు ఈ సమావేశాల్లో అవకాశం ఉంది. ప్రతిపక్షాల విమర్శలను ధీటుగా ఎదుర్కోవాలి. సభ్యులు ఖచ్చితంగా సభకు రావాల్సిందే. సమావేశాల్లో సభ్యులంతా సమన్వయంతో ముందుకెళ్లాలి. ఎం ఎల్ ఏ లు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలి. జిల్లాల వారీగా ఎమ్మెల్యేతో సమావేశం అవుతా’’ అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

అసెంబ్లీ షెడ్యూల్ ఇదే..

అసెంబ్లీ సమావేశాలు మార్చి 27 వరకు జరగనున్నాయి. వాటిలో రేపు అంటే మార్చి 13న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం జరగనుంది. మార్చి 14న హోలీ సందర్భంగా అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. మార్చి 17, 18 తేదీల్లో బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లుల ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మార్చి 19న రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 20న సెలవు. 21, 22న బడ్జెట్‌పై చర్చ. 23న సెలవు. 24 నుంచి 26 వరకు పద్దులపై చర్చ జరగనుంది. 27 న ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం, సభ నిరవధికంగా వాయిదా పడుతుంది.

Tags:    

Similar News