ఓటర్ల తుది జాబితాను ప్రకటించిన ఈవో సుదర్శన్

తెలంగాణ ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.

Update: 2024-11-02 12:16 GMT

తెలంగాణ ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తెలంగాణ ఓటర్ల తుది జాబితాను సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు. అక్టోబర్ 29న ఓటర్ల డ్రాఫ్ట్ జాబితాను ప్రకటించామని, ఈ లెక్కల ప్రకారం ప్రస్తుతం తెలంగాణలో 3,34,26,323 మంది ఓటర్లు ఉన్నారని వెల్లడించారు. కొత్తగా ఎనిమిది లక్షల మంది తెలంగాణలో ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. ఇప్పటికే ఉన్న ఓటలర్ల జాబితాలో 4.14 లక్షల మందిని తొలగించడం జరిగిందని వివరించారు. యువ ఓటర్లు 4,73,838 మంది ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. తెలంగాణలో 551 పోలింగ్ కేంద్రాలు పెరిగాయని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో 35,907 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను ఈనెల 28వ తేదీ వరకు స్వీకరిస్తామని, జనవరి 6న ఓటర్ల తుది జాబితా ప్రకటన ఉంటుందని సుదర్శన్ రెడ్డి వివరించారు. ఈ క్రమంలోనే నవంబర్ 9,10 తేదీల్లో ఓటర్ల నమోదు స్పెషల్ క్యాంపెన్ నిర్వహించనున్నట్లు కూడా ప్రకటించారు. బీఎల్ఓలు ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్ స్టేషన్‌లలో అందుబాటుల ఉండాలని, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎస్జీటీలకు ఓటు హక్కు లేదని వివరించారాయన.

Tags:    

Similar News