ఎంపిటిసి జడ్పిటిసి స్థానాలు అనౌన్స్ చేసిన తెలంగాణ గవర్నమెంట్

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కీలక ప్రకటన;

Update: 2025-07-16 15:14 GMT

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ గవర్నమెంట్ కీలక ప్రకట చేసింది. ఎంపిటిసి, జడ్ పిటి సి స్థానాలను తెలంగాణ గవర్నమెంట్ కన్ఫర్మ్ చేసింది. రాష్ట్రంలో 31 జడ్ పిస్థానాలు, 566 ఎంపీపీ , జడ్ పిటిసిస్థానాలు, 5, 773 ఎంపీటీసీ స్థానాలు, 12, 778 గ్రామ పంచాయతీలు, 1, 12 లక్షల వార్డులు ఉన్నట్టు పేర్కొంది. త్వరలో స్థానిక సంస్థల షెడ్యూల్ విడుదల కానుంది.

తెలంగాణలో స్థానిక సంస్థల పోరుకు రంగం సిద్ధమవుతోంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల అనంతరం జరుగుతున్న స్థానిక ఎన్నికలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలకు వెళ్లేందుకు అధికార పార్టీ వెనకడుగు వేస్తోంది. న్యాయస్థానాలతోపాటు ప్రతిపక్షాల ఒత్తిడి తాళలేక ఎన్నికలకు వెళ్లడానికి సిద్దమైంది. బిసి రిజర్వేషన్ ఆర్డినెన్స్ నిర్ణయం ప్రతిపక్షాల వత్తిడి అని వేరే చెప్పక్కర్లేదు. ఈ క్రమంలోనే జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ స్థానాలకు సంబంధించి ప్రభుత్వం ప్రకటన చేసింది.

Tags:    

Similar News