రేవంత్ పాలనలో ఆర్థిక విధ్వంసం: కేటీఆర్

నెంబర్ వన్ రాష్ట్రాన్ని నెంబర్ లాస్ట్‌కు తెచ్చిన ఘటన రేవంత్‌దే.

Update: 2025-10-03 09:15 GMT

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు విమర్శలు చేశారు. దేశానికే ఆదర్శంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని చేతకాని పాలనతో కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టు పట్టించారంటూ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలయిందన్నారు. సరిగ్గా రెండేళ్ల క్రితం కేసీఆర్ పాలనలో దేశంలోనే నెంబర్‌ వన్‌గా తెలంగాణ నిలిచిందని.. కానీ ఇప్పుడు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అట్టడుగుకు పడిపోయిందని అన్నారు. తాజాగా 2025 సెప్టెంబర్ నెలలో వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) వసూళ్ల వృద్ధి రేటులో తెలంగాణ.. దేశంలోనే అట్టడుగు స్థానంలో ఉండటం దారుణమన్నారు కేటీఆర్. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆర్థిక విధ్వంసానికి ఇంతకు మించిన నిదర్శనం మరొకటి లేదని వ్యాఖ్యానించారు.

జీఎస్‌టీ వృద్ధిలో నమోదైన ఈ పతనం, రేవంత్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎంత విధ్వంసం అయిందే చెప్పే అంశమన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వ్యవసాయం నుంచి ఐటీ వరకు అన్ని రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇచ్చిందని, దాంాతో ఆర్థికవ్యవస్థ పరుగులు పెట్టింనది, రికార్డులను తిరగరాసిందని కేటీఆర్ పేర్కొన్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో పండగొచ్చినా.. పబ్బమొచ్చినా అన్ని వర్గాలూ నేలచూపులే చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘వ్యవసాయం నుండి రియల్ ఎస్టేట్ వరకూ అన్ని రంగాల్లో దైన్యమే తాండవిస్తోంది. అరాచకత్వం, అవినీతి, అనుభవలేమి కలగలసిన రేవంత్ పాలనలో తెలంగాణ ఆర్థిక విధ్వంసానికి గురవుతోంది’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.

Tags:    

Similar News