HCU భూముల వివాదం.. ఏప్రిల్ 7కి వాయిదా
ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నెల ఏడు వరకు గడువు ఇస్తూ.. విచారణను మరోసారి వాయిదా వేసింది న్యాయస్థానం.;
కంచ గచ్చిబౌలి భూముల విచారణను తెంలగాణ హైకోర్టు ఏప్రిల్ 7కు వాయిదా వేసింది. ఈ భూముల వేలం, అక్కడ చేపట్టిన చదును పనులకు వ్యతిరేకంగా వట ఫౌండేషన్, హెచ్‌సీయూ విద్యార్థులు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ పిల్‌స్వీకరించిన న్యాయస్థానం ఏప్రిల్ 2న విచారణ జరిపి.. ఎక్కడి పనులను అక్కడ ఆపేయాలని ఆదేశించింది. అనంతరం నేటికి విచారణను వాయిదా వేసింది. ఈరోజు తిరిగి విచారణ మొదలు కాగా.. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నెల ఏడు వరకు గడువు ఇస్తూ.. విచారణను మరోసారి వాయిదా వేసింది న్యాయస్థానం. దీంతో ఈ పిల్‌పై తదుపరి విచారణ ఏప్రిల్ 7న జరగనుంది. తాత్కాలిక చీఫ్ జస్టిస్ సుజయ్ పాల్ నేతృత్వంలోని ధర్మానసం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం 400 ఎకరాల పచ్చదనాన్ని నాశనం చేస్తున్నారని పేర్కొంటూ వట ఫౌండేషన్ తన పిల్‌లో పేర్కొంది.
ఈ పిల్ విచారణలో భాగంగా ప్రభుత్వం తరుపున ఏఎం సింఘ్వీ వాదనలు వినిపించారు. ఈ డెవెలప్‌మెంట్ పనులతో 5లక్షల ఉద్యోగావకాశాలు అందుతాయని ప్రాజెక్ట్ చెప్తోందని వివరించారు. అదే విధంగా ఆ భూములు అటవీ భూములు అని నిరూపించేలా ఎటువంటి ఆధారాలు లేవని అన్నారు. ఆయన వాదనలు విన్న అనంతరం ఏప్రిల్ 7 వరకు కేసు విచారణను న్యాయస్థానం వాయిదా వేసింది. అదే విధంగా అప్పటి వరకు హెచ్‌సీయూ భూముల్లో పనులను కూడా ఆపేయాలని ఆదేశించింది.