సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కాజేసిన నిందితులు
రాజకీయ నాయకుల జోక్యంతో;
నెల రోజుల వ్యవధిలో రెండు సార్లు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల్లో గోల్ మాల్ జరగడం ఇపుడు చర్చనీయాంశమైంది. గత నెల మహబూబాబాద్ జిల్లాకు చెందిన సోమయ్య పేరిట వచ్చిన చెక్కును కోనపురానికి చెందిన మరో వ్యక్తికి చెక్కును కాజేసాడు. తాజాగా హైదరాబాద్ లో జరిగిన సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు గోల్ అయ్యాయి. ఈ రెండు కేసుల్లో రాజకీయ నాయకులే కీలక సూత్రధారులని తెలుస్తోంది.
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను కాజేసిన నలుగురు నిందితులను హైదరాబాద్ పోలీసులు అరెస్ల్ చేశారు. జోగుల నరేష్ ( మెట్టూగూడ), వెంకటేశ(వనస్థలిపురం), వంశీ(ఖమ్మం), ఓంకార్ ( పెద్దపల్లి) ప్రభుత్వం మారిన తర్వాత ఎవరూ సంప్రదించని 19 చెక్కులను చేజిక్కించుకున్నారు. ఫోర్జరీ సంతకాలు చేసి చెక్కులను సొమ్ము చేసుకున్నారు. నిందితుల్లో ఒకరైన జోగుల రమేష్ మాజీ మంత్రి పేషిలో పని చేసినట్టు పోలీసులు తెలిపారు.
ప్రకృతి వైపరీత్యాల బాధితులకు, వివిధ రకాల వైద్య చికిత్సల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ప్రయోజనాలను అందిస్తున్నారు. వృద్ధాప్యం , శారీరక వైకల్యంతో బాధపడుతున్నవారికి ముఖ్యమంత్రి సహాయ నిధి అందుతోంది . పేదరికంలో ఉన్న వ్యక్తులకు ఇది అందించబడుతుంది.
ఏకంగా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను గోల్ మాల్ చేసిన నిందితులకు ఎవరెవరు సహకరించారు అనే విషయాలను ఆరా తీస్తున్నారు.