పేగు బంధాన్ని తెంచేసిన అమ్మ
జనగామ జిల్లాలో కలకలం రేపిన రోడ్డుపై పడి ఉన్న శిశువు;
By : B Srinivasa Chary
Update: 2025-07-16 10:49 GMT
ఈ సృష్టిలో పేగుబంధం గొప్పది. పేగు బంధం తప్ప మిగతా బంధాలు దాదాపు వ్యాపార బంధాలే.
అప్పుడే పుట్టిన బిడ్డను వదిలించుకోవాలనుకుంది ఓ కన్న తల్లి. జనగామ జిల్లా రఘునాథ మండలం కిలాషపురం గామంలో చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది. రోడ్డుపై పడి ఉన్న పసికందు గూర్చి పోలీసులకు సమాచారమందడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రోడ్డు పక్కన పడి ఉన్నపసికందుకు వస్త్రం చుట్టి ఉంది. ఈ శిశువు ప్రస్తుతం చైల్డ్ వెల్ఫేర్ అధికారుల సంరక్షణలో ఉంది. శిశువుకు జనగామ ఎంసిహెచ్ లో చికిత్స అందిస్తున్నారు.
రోడ్డుపై పడేసిన ఆ అమ్మ ఎవరు అని పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.