టీపీసీసీ కీలక నిర్ణయం.. ఉమ్మడి జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌ల నియామకం
కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఫుల్ ఫోకస్ పెట్టింది. పార్టీ పరంగా పదవులను భర్తీ చేసుకుంటూ ముందుకు పోతోంది. వీలైనంత త్వరగా పార్టీ పదవులను భర్తీ చేయాలన్న అధిష్టానం ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తోంది తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను టీపీసీసీ నియమించింది. తాజాగా ఉమ్మడి జిల్లాల ఇన్‌ఛార్జ్‌లను నియమించింది. ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.. 10 జిల్లాల ఇన్‌ఛార్జ్‌లతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇన్‌ఛార్జ్ పదవి విధివిధానాలను మీనాక్షి వివరించారు. అంతేకాకుండా అతిత్వరలోనే గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేస్తామని, కాబట్టి ఇన్‌ఛార్జ్‌లు వెంటనే రంగంలోకి దిగి పనులు చేపట్టాలని తెలిపారు.
ఉమ్మడి జిల్లాల ఇన్‌ఛార్జ్‌లు వీళ్లే..
హైదరాబాద్ - జగ్గారెడ్డి
వరంగల్ - అడ్లూరి లక్ష్మణ్
ఖమ్మం - వంశీచంద్‌రెడ్డి
మెదక్ - పొన్నం ప్రభాకర్
నల్గొండ - సంపత్ కుమార్
నిజామాబాద్ - అజ్మతుల్లా హుస్సేన్
రంగారెడ్డి - శివసేన రెడ్డి
మహబూబ్‌నగర్ - కుసుమ కుమార్
కరీంనగర్ - అద్దంకి దయాకర్
ఆదిలాబాద్ - అనిల్ యాదవ్